హోమ్ /వార్తలు /తెలంగాణ /

Adilabad: మంచు దుప్పటి కప్పుకున్న తెలంగాణ కాశ్మీర్.. పెరిగిన చలి తీవ్రత

Adilabad: మంచు దుప్పటి కప్పుకున్న తెలంగాణ కాశ్మీర్.. పెరిగిన చలి తీవ్రత

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Adilabad: ఆదిలాబాద్ జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది. గాలులు గిలిగింతలు పెడుతోంది. చలి గజగజ వణికిస్తోంది. రెండు రోజులుగా జిల్లాలో నెలకొన్న వాతావరణ పరిస్థితులతో జిల్లా కాశ్మీరును తలపిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Adilabad

(కట్టా లెనిన్, న్యూస్ 18 తెలుగు, ఆదిలాబాద్ జిల్లా)

తెలంగాణ కాశ్మీర్‌గా పిలువబడుతున్న ఆదిలాబాద్ (Adilabad) జిల్లా మంచు దుప్పటి కప్పుకుంది. నిజంగానే కాశ్మీరును తలపిస్తోంది. గత రెండు రోజులుగా జిల్లాలో వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. పొగమంచు కమ్ముకొని జాతీయ రహదారితోపాటు ఇతర రహదారులపై వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు  పడాల్సివచ్చింది. బుధవారం కొంత మబ్బుగా ఉన్నా, గురువారం మరింత పొగమంచు ఆవరించడంతో చలి తీవ్రత మరింత పెరిగింది. మూడు నాలుగు క్రితం వరకు చలి ప్రభావం కొంత తగ్గిపోయినప్పటికి ఒక్కసారిగా చలి తీవ్రత (Cold Wave) పెరిగిపోయింది. గురువారం నిండా పొగమంచు కమ్మేయడంతో మధ్యాహ్నం దాటినా సూర్యుడి దర్శనం లభించలేదు. కమ్ముకున్న మబ్బుల చాటున సూర్యుడు చిక్కుకోవడంతో వాతావరణం అంతా చల్లబడిపోయి చలి ప్రతాపం చూపింది. దట్టమైన పొగమంచు ఆవరించడంతో ప్రజలు రోజువారి జీవితానికి ఇక్కట్లు పడాల్సి వచ్చింది.

అటు ప్రయాణీకులు కూడా అవస్థలు పడ్డారు. తాంసి, భీంపూర్ మండలాల్లో పలుచోట్ల చిరు జల్లులు కూడా కురిశాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడం చలి పెరగడం, దీనికి తోడు చల్లటి గాలులు తోడవటం, మంచు కూడా కురవడంతో ప్రజలు ఇళ్ళలోంచి బయటకు రాకుండా చలి మంటలు వేసుకున్నారు. జిల్లాలో మొన్నటి వరకు చలి తీవ్రత తక్కువగా ఉంది. అయితే ఒక్కసారిగా ఈ రెండురోజుల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. మరోవైపు రాగల 48 గంటలలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డా. వై. ప్రవీణ్ కుమార్ తెలిపారు. రైతులు ఎండబెట్టిన ధాన్యం, ఇతర పంట ఉత్పత్తుల మీద టార్పాలిన్ కవర్లు కప్పుకోవాలని సూచించారు.

Kamareddy: కామారెడ్డిలో రైతుల ఆందోళనపై స్పందించిన కలెక్టర్.. ఏమన్నారంటే..

ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా జిల్లాలో నెలకొన్న వాతావరణ పరిస్థితులతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రైతులు ఖరీఫ్ సాగులో సోయాబీన్ పంట తర్వాత రబీ  సాగులో శనిగ పంటను అధిక మొత్తంలో సాగు చేశారు. అయితే అధిక వర్షాలతో ఖరీఫ్ లో సోయబిన్ పంట తీవ్రం నష్టం కలిగించినా రబీ లో  వాతావరణం అనుకూలించి శనగ పంటతోనైన లాభం చేకూతుందని రైతులు ఆశతో శనగ సాగుచేస్తున్నారు. కాగా శనగ పంట వేసిన నాటి నుండి  తీవ్రమైన తెగుళ్లు వ్యాప్తి చెందాయని, వాటి నివారణకు అధిక ధరలకు రసాయన మందులు తెచ్చుకొని చల్లుకున్నామని, అలాగే  అడవి పందుల నుండి సంరక్షణ కొరకు సోలార్ ప్యానల్ ను కూడా వేల రూపాయలతో ఏర్పాటు చేసుకున్నామని తలమడుగుకు మండలం సుంకిడి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ న్యూస్ 18 తో తెలిపారు.

పంట పూత, కాత దశలో ఉన్న ప్రస్తుత సమయంలో గత రెండు రోజుల నుండి వాతావరణంలో పెను మార్పులు సంభవించి,  ఉదయం నుండి సాయంత్రం వరకు పొగ మంచు కమ్మేయడంతో శనగ పంట తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Adilabad, Cold wave, Telangana