ఆదిలాబాద్‌లో ఆదివాసుల ప్రతిఘటన...అటవీ శాఖ అధికారులను అడ్డుకున్న వైనం...

ఆదిలాబాద్ అటవీ రేంజ్ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో ఈ ప్రాంతంలో జేసిబితో గుంతలు తవ్విస్తుండగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో పలు గిరిజన కుటుంబాలు అక్కడికి చేరుకొని అధికారుల చర్యలను ప్రతిఘటించారు.

news18-telugu
Updated: February 16, 2020, 10:23 PM IST
ఆదిలాబాద్‌లో ఆదివాసుల ప్రతిఘటన...అటవీ శాఖ అధికారులను అడ్డుకున్న వైనం...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ గ్రామీణ మండలం పరిధిలోని అంకొలి గ్రామ శివారులో 41, 68 సర్వే నెంబర్లలో అటవీ శాఖ అధికారులు కందకాలు తవ్వడాన్ని స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. ఆదిలాబాద్ అటవీ రేంజ్ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో ఈ ప్రాంతంలో జేసిబితో గుంతలు తవ్విస్తుండగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో పలు గిరిజన కుటుంబాలు అక్కడికి చేరుకొని అధికారుల చర్యలను ప్రతిఘటించారు. కందకం పనులను అడ్డుకున్నారు. గత కొంతకాలంగా ఈ సర్వే నెంబర్లతో తాము భూములు సాగుచేసుకుంటుండగా అటవీ శాఖ అధికారులు ఇప్పుడు ఇది తమ పరిధిలోకి వస్తుందని బలవంతంగా భూములు లాక్కోవడాన్ని వారు ఖండించారు. ఏళ్లు గా భూములు సాగు చేసుకుంటున్న రైతులను బలవంతంగా ఖాళీ చేయించడం అమానుషమని తుడుం దెబ్బ అధ్యక్షుడు గోడం గణేష్ అన్నారు. పిసా చట్టం ప్రకారం అటవీ భూములపై గిరిజనులకు హక్కులు కల్పించాల్సిన అధికారులు రియల్ వ్యాపారులు, రాజకీయ నాయకులతో కుమ్మక్కై పేద గిరిజనుల భూములను లాక్కుంటున్నారని అన్నారు.

First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు