Home /News /telangana /

ADILABAD GINNEDARI RECORDS 3 POINT 5 DEGREE CELSIUS TEMP COLDEST DAY IN SEASON IN TELANGANA MKS

Telangana: పెరిగిన చలి.. రెడ్ అలర్ట్ జారీ -Adilabad గిన్నెదరిలో 3.5 డిగ్రీలు

తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రత

తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రత

తెలంగాణలో చలి విపరీతంగా పెరిగిపోతోంది. సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగత్రలు తగ్గుముఖం పడుతున్నాయి. చలి తీవ్రత ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీగా పెరిగింది. మంగళవారం ఉదయం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా గిన్నెదరిలో ఉష్ణోగ్రతలు 3.5 డిగ్రీలకు పడిపోయాయి.

ఇంకా చదవండి ...
హిమాలయాలకు దగ్గరగా ఉండే ఉత్తరాది రాష్ట్రాలు, దేశ రాజధాని ఢిల్లీతో పోటీ పడుతోందా? అన్నట్లుగా తెలంగాణలో చలి అలా అలా పెరిగిపోతున్నది. రాష్ట్రం దాదాపుగా పొగమంచు గుప్పిట్లోకి వెళ్లింది. ఈశాన్యం నుంచి శీతలగాలులు వీస్తుండటంతో వణుకు ఇంకా పెరిగింది. రాజధాని హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలోనైతే టెంపరేచర్ ఏకంగా 3.5 డిగ్రీలకు దిగజారింది. ఇది చాలదన్నట్లు, రాబోయే మూడు రోజుల్లో మెర్క్యూరీ లెవల్స్ మరింత కిందికి వెళతాయని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. మంగళవారం ఉదయం నాటికి రాష్ట్రంలో వాతావరణ పరిస్థితిపై ఐఎండీ చెప్పిన వివరాలివే..

తెలంగాణలో చలి విపరీతంగా పెరిగిపోతోంది. ఒక్కసారిగా రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగత్రలు గతంలో ఎన్నడూ లేని విధంగా తగ్గుముఖం పడుతున్నాయి. నేటి నుంచి మరో మూడు రోజుల పాటు చలి పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం వేకువ జాము నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు భారీగా కమ్మేసింది.

wife delivery : నువ్వేం మనిషివయ్యా!! -YouTubeలో చూస్తూ భార్యకు ప్రసవం.. చివరికి ఇలా..



చలి తీవ్రత ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీగా పెరిగింది. మంగళవారం ఉదయం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా గిన్నెదరిలో ఉష్ణోగ్రతలు 3.5 డిగ్రీలకు పడిపోయాయి. అలాగే బేలా, సిర్పూర్‌ (యూ)లో 3.8, అర్లి(టీ) 3.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే వాంకిడిలో 4.9, జైనథ్‌లో వాంకిడి లో 4.9, చాప్రాలలో 5.1, సోనాలా లో 5.2, బజార్‌హత్నూర్‌లో 5.3, లోకిరిలో 5.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని టీఎస్‌ డీపీఎస్‌ పేర్కొంది.

అద్బుతమైన టైమ్ మెషీన్‌.. ఖగోళ రహస్యాలు చూడొచ్చు.. James Webb Space Telescope లాంఛ్..


చలితీవ్రతకు జనం వణుకుతున్నారు. దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగా వాహనదారులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. ఈశాన్య భారత నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో శీతల గాలులు ఉధృతంగా వీస్తున్నాయి. సాయంత్రం వేళలో గాలుల తీవ్రత పెరుగుతున్నది. ఉష్ణోగ్రతలు పడిపోయి, చలి పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిన్న పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Adilabad, Telangana, WINTER

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు