హోమ్ /వార్తలు /తెలంగాణ /

Adilabad : ఆదిలాబాద్‌ అడవులకు పసుపు, కుంకుమ..వర్ణం... ఎర్రబారిన అడవి...!

Adilabad : ఆదిలాబాద్‌ అడవులకు పసుపు, కుంకుమ..వర్ణం... ఎర్రబారిన అడవి...!

Adilabad : అడవులకు నెలవైన ఆదిలాబాద్ జిల్లాలోని అడవులు ఎరుపెక్కాయి.మోదుగపూలు విరగబూసి కొత్త అందాలను అద్దుతున్నాయి. పచ్చదనం తగ్గిపోయిన అడవికి కొత్తసోయాగాన్ని 
అందిస్తున్నాయి.

Adilabad : అడవులకు నెలవైన ఆదిలాబాద్ జిల్లాలోని అడవులు ఎరుపెక్కాయి.మోదుగపూలు విరగబూసి కొత్త అందాలను అద్దుతున్నాయి. పచ్చదనం తగ్గిపోయిన అడవికి కొత్తసోయాగాన్ని అందిస్తున్నాయి.

Adilabad : అడవులకు నెలవైన ఆదిలాబాద్ జిల్లాలోని అడవులు ఎరుపెక్కాయి.మోదుగపూలు విరగబూసి కొత్త అందాలను అద్దుతున్నాయి. పచ్చదనం తగ్గిపోయిన అడవికి కొత్తసోయాగాన్ని అందిస్తున్నాయి.

  (కట్టా లెనిన్, న్యూస్ 18, ఆదిలాబాద్ జిల్లా)

  అడవులకు నెలవైన ఆదిలాబాద్ జిల్లాలోని అడవులు ఎరుపెక్కాయి. పచ్చని ఆకులతో హరిత వర్ణ శోభతో అలరారే ఆదిలాబాద్ అడవులు ఎరుపెక్కడం ఏమిటని ఆలోచిస్తున్నారా. నిజమే, అడవులు ఎరుపెక్కాయి. ఎట్లా అంటే ఆకులన్ని రాలిపోయి బోసిపోతున్న అడవుల్లో మోదుగపూలు విరగబూసి కొత్త అందాలను అద్దుతున్నాయి. పచ్చదనం తగ్గిపోయిన అడవికి కొత్తసోయాగాన్ని అందిస్తున్నాయి. అయితే ఎండాకాలనికి ముందు ఫిబ్రవరి, మార్చి నెలల్లో అటవీ ప్రాంతాలు మోదుగ పూలతో ఆకర్షణీయంగా మారుతాయి. ప్రకృతి ప్రసాదించిన పువ్వులలో  ఈ మోదుగపూలు విశిష్టమైన ఎరుపు రంగులతో కూడుకుని చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

  ఏ గ్రామానికి వెళ్లినా, ఎరుపు వర్ణంతో మోదుగా పూల చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. ఇక హోళి పండుగ సమయంలో అందుబాటులో ఉండే ఈ మోదుగ పూలనే రంగులుగా తయారుచేసి వేడుకలు జరుపుకునే సంప్రదాయం మన సొంతం. ఫాల్గుణ మాస పౌర్ణమి సందర్భంగా నిర్వహించే హోలి పండుగకు సంప్రదాయ మోదుగ పూల రంగులనే వినియోగించడం ఆనవాయితీ. పండుగకు ముందే.. నారింజ రంగుతో కూడిన ఎర్రని పూలను సేకరించి అందులోని పుప్పొడితో సహజ రంగులను తయారు చేసేవారు. ఆరోగ్యానికి ఏమాత్రం హాని చేయని మోదుగ పూల రంగులతోనే హోళి వేడుకలు జరుపుకునేవారు.

  Nalgonda : సాగర్ కాలువలో కొత్త కారు కలకలం.. కావాలనే నెట్టిన జంట...

  అయితే కాల క్రమేణ చర్మం, కళ్లు, కేశాల ఆరోగ్యాన్ని తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసే రసాయన రంగుల వినియోగం పెచ్చుమీరుతోంది. దీంతో మోదుగ పూలకు ఆదరణ కరువైంది. అయితే జిల్లాలోని మారుమూల ఆదివాసి గిరిజన గూడాల్లో మాత్రం నేటికి అక్కడి గిరిజనులు మాత్రం ఈ మోదుగ పూలతో తయారు చేసిన సహజ రంగులతో హోలి వేడుకలు జరుపుకోవడం నాటి సంప్రదాయ విశిష్టతను చాటుతోంది. ఇదిలా ఉంటే మోదుగ పూలకు ఆయుర్వేద వైద్యంలోనూ ప్రాధాన్యముంది. పలు ఔషధ్ గుణాలు కలిగి ఉన్న ఈ మోదుగ పూలను వైద్యానికి కూడా ఉపయోగిస్తున్నారు.

  అలాగే సాహిత్యంలో మోదుగపూల ప్రస్తావన ఉంది. ప్రముఖ రచయిత, స్వాతంత్ర సమరయోధుడు ఈ మోదుగపూలు పేరుతో నవలను కూడా రాశారు. నాటి నిజాం ఏలుబడిలో తెలంగాణ ప్రజల స్థితిగతులు, నాటి బానిస పద్దతులను, తెలంగాణలో జరిగిన ప్రజాపోరాటాన్ని ఈ నవలలో చిత్రించారు. ఆ  తర్వాత ఈ నవలను నాటకంగా కూడా ప్రదర్శించారు. ఇదిలా ఉంటే మరోవైపు ఇదే వేసవిలో పసుపు వర్ణంలో విరగబూసే రేల పూలు కూడా ఆదిలాబాద్ జిల్లా అడవులకు కొత్త అందాలను తెచ్చిపెడుతున్నాయి. ఎర్రని మోదుగ పూలు, పచ్చని రేల పూలు ఆదిలాబాద్ అడవులకు పసుపు కుంకుమను అద్దినట్లు కనిపిస్తూ చూపరులను పరవశులను చేస్తాయి.

  First published:

  Tags: Adilabad forest, Telangana

  ఉత్తమ కథలు