హోమ్ /వార్తలు /తెలంగాణ /

మొన్నటి వరకు పులులు..ఇప్పుడు కుక్కలు..ఉమ్మడి ఆదిలాబాద్ లో భయం..భయం

మొన్నటి వరకు పులులు..ఇప్పుడు కుక్కలు..ఉమ్మడి ఆదిలాబాద్ లో భయం..భయం

కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారి

కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారి

Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కనబడిన వారిపై దాడి చేసి గాయ పరుస్తున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Adilabad, India

K.Lenin,News18,Adilabad

తెలంగాణలోని పలు జిల్లాల్లో వీధి కుక్కల స్వైర విహారం విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా అదే పరిస్థితి నెలకొంది. జిల్లాలో కుక్కలు స్వైర విహారం చేస్తూ జనాలను బెంబెలెత్తిస్తున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా కనబడ్డ వారిపై విరుచుకుపడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కుక్కల భయం జిల్లా వాసులను వెంటాడుతోంది. తాజాగా జిల్లా కేంద్రంతోపాటు పలు చోట్ల పలువురిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఇటీవల కుక్కల దాడిలో హైదరాబాద్ అంబర్ పేట్ లో నాలుగేళ్ళ బాలుడు మృతి చెందిన సంఘటనను మరిచిపోకముందే అడపాదడపా కుక్కల దాడులు ఏదో ఒక మూలన జరుగుతూనే ఉన్నాయి.

తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్.. రాష్ట్రానికి వర్షాలు..!

కాగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్ విలేజ్ నెం.12లో క్రితిక్ బైరాగి(6) ఇంటి ముందు ఆడుకుంటున్న క్రమంలో పిచ్చి కుక్క దాడి చేసి చెంపపై తీవ్రంగా రక్కేసింది. చిన్నారిని చికిత్స కోసం కుటుంబీకులు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ అసుపత్రికి తరలించారు. అటు మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని రామన్ కాలనిలో శునకాల దాడిలో విశ్వ(13)కు గాయాలయ్యాయి. హుటాహుటిన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోనూ కుక్కలు హల్ చల్ చేశాయి. మండల కేంద్రంలోని గజనంద్ నగర్ , మర్కగూడలో కుక్కలు దాడి చేసి ముగ్గురిని గాయపరిచాయి. ఒక్క ఇంద్రంవెల్లి మండలంలోనే జనవరి నెలలో 34 మంది, ఫిబ్రవరి నెలలో 38 మంది, మార్చి నెలలో ఇప్పటి వరకు 14 మంది కుక్కల దాడిలో గాయపడినట్లు స్థానిక వైద్యుడు వివరించారు.

Amit Shah Tour : హైదరాబాద్‌లో అమిత్ షా.. రాజకీయ వ్యూహాల్లో బీజేపీ

తాజా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీలో ఓ పిచ్చి కుక్క దాడి చేసి ఏడుగురిని గాయపరిచింది. గాయపడ్డ వారంతా కూడా మహిళలే. కుక్క కాటు బాధితులను జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందజేశారు. ఇంటి నుండి బయటకి వెళ్లాలంటే చేతిలో కర్ర తప్పనిసరి అయ్యింది. కుక్కల బెడదతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. చేతిలో కర్ర లేనిదే వీధుల్లోనూ తిరగడం లేదు. అప్పటి వరకు బాగానే ఉంటున్న శునకాలు ఒక్కసారిగా మీద పడుతుండటంతో కుక్కలంటేనే జంకుతున్నారు. మరీ ముఖ్యంగా పిల్లలను బయటకు పంపాలంటేనే వణుకు పుడుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కుక్కల బెడద నుంచి రక్షణ కల్పించాలని పలువురు వేడుకుంటున్నారు.

ఇకపోతే మొన్నటి వరకు పెద్ద పులులు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఇప్పుడేమో కుక్కల వంతైందని చెప్పుకుంటున్నారు.

First published:

Tags: Adilabad, Dogs, Stray dogs, Stray dogs attack, Telangana

ఉత్తమ కథలు