Home /News /telangana /

ADILABAD FARMERS USING LATEST TECHNOLOGY FOR AGRICULTURE VRY ADB

Adilabad : వ్యవసాయ కూలీల కొరత అధిగమించేందుకు ఆ జిల్లా రైతుల సరికొత్త ఆలోచన..

ఆధునిక యంత్రాలతో వ్యవసాయం

ఆధునిక యంత్రాలతో వ్యవసాయం

Adilabad : ఓ వైపు వ్వవసాయమే జీవనాధారం మరోవైపు కూలీల కొరత.. దీంతో ఆధునిక వ్యవయం వైపు రైతులు పరుగులు తీస్తున్నారు. వ్యవసాయంలో వస్తున్న సాంకేతిక మార్పులను అందిపుచ్చుకుంటున్న ఆ జిల్లా రైతులు ఆ రంగంలో మరింత రాణిస్తున్నారు.

    (కట్టా లెనిన్, న్యూస్ 18 తెలుగు, ఆదిలాబాద్ జిల్లా)

    ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు వ్యవసాయంలో యాంత్రీకరణ బాటపడుతున్నారు.  కూలీల కొరతను ఎదుర్కొనేందుకు ఈ యాంత్రీకరణే పరిష్కారంగా భావిస్తున్న జిలా రైతులు ఈ యాంత్రీకరణ వైపు అడుగులు వేస్తున్నారు. ట్రాక్టర్లు, టిల్లర్లు, వరి నాటే మిషన్లు, కోత మిషన్లు, రొటెవేటర్లు ఇంకా వ్యవసాయాని సంబంధించిన పలు రకాల యంత్రాలు అందుబాటులో ఉండటంతో వాటిని వినియోగిస్తున్నారు. ఆర్థికంగా కొంత బలంగా ఉన్న రైతులు వాటిని కొనుగోలు చేసి వ్యవసాయంలో ఉపయోగించుకుంటుంటే, చిన్న, సన్నకారు రైతులు మాత్రం యంత్రాలను అద్దెకు తీసుకువచ్చి వ్యవసాయ పనులకు వినియోగించుకుంటున్నారు.

    ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ప్రధానంగా పత్తి పంటకు ప్రాధాన్యత ఇచ్చిన రైతులు పత్తి పంట పెట్టుబడి వ్యయం, పంట తెగుళ్లు  మరియు కూలీల కొరతతో  ఇబ్బంది పడాల్సి వస్తోంది. దీంతో వారు ప్రత్యామ్నాయ పంటలైన సోయాబీన్, కంది తదితర పంటలు వేస్తూ వస్తున్నారు. ఈ పంటలకు కూలీల కొరత,వాతావరణ పరిస్థితుల ప్రభావం, అడవి పందులు, ఇతర అటవీ జంతువుల బారి నుండి కాపాడుకొని పొలంలోని పంటను తీసుకోవడం లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు ఈ యంత్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలుపుతున్నారు.

    Medram specilal : మేడారం భక్తులకు తీపికబురు.. ఇంటి నుండే మొక్కులను ఇలా తీర్చుకోవచ్చు.

    జిల్లాలోని తలమడుగు మండలం తో పాటు వివిధ మండలాల్లో రైతులు కంది, పంటను  పక్క జిల్లాల నుండి వస్తున్న హార్వేస్టర్ల తో పంటను తీసుకుంటున్నారు. ఇలా చేయడం వలన సమయం, డబ్బులు ఆదా అవుతున్నాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. అలాగే అటు ప్రభుత్వం  రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు, ఖరీఫ్, రబీ పంటలకు పెట్టుబడి సాయం అందించడంతో రబీ పంటలను కూడా అధిక మొత్తంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు  లేకుండా  సాగు చేస్తున్నారు.

    ఈయేడు రబీ సీజన్ లో ప్రధానంగా శనగ, గోధుమ, వేరుశనగ తదితర పంటలను మండలాల రైతులు సాగు చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూలీల కొరత, సాధారణంగా పొరుగున ఉన్న మహారాష్ట్ర నుండి కూలీలను రప్పించుకొని పనులను పురమాయించడంతో రైతులకు కొంత ఆర్థికంగా భారమవుతోంది. సమయానికి కూలీలు దొరకక పంట కోత ఇతర పనుల్లో కూడా జాప్యం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జిల్లా రైతులు వ్యవసాయంలో పలు రకాల యంత్రాలను ఉపయోగించుకోవడంతో సమయంతోపాటు డబ్బులు కూడా ఆదా అవుతున్నాయని అంటున్నారు.

    TS Politics : టెక్ పాలిటిక్స్.. మారిన రాజకీయ రంగు... ఏదైనా,ఎవరినైనా.. కొనాల్సిందే..

    రైతులను ఆధునిక సాగు వైపు మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వాలు వ్యవసాయంలో అవసరమైన వివిధ రకాల యంత్ర పనిముట్లను తక్కువ ధరల్లో అందుబాటులోకి తీసుకువస్తే రైతులు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని జిలా రైతులు అభిప్రాయపడుతున్నారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Adilabad, Agriculture

    తదుపరి వార్తలు