హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: వినూత్నంగా ఆలోచించిన రైతన్న.. గంటలో 60 గుంటల పొలాన్ని దున్నేశాడు.. అదెలాగో తెలుసుకోండి..

Telangana: వినూత్నంగా ఆలోచించిన రైతన్న.. గంటలో 60 గుంటల పొలాన్ని దున్నేశాడు.. అదెలాగో తెలుసుకోండి..

బైక్ సహాయంతో పొలాన్ని దున్నుతున్న దృశ్యం

బైక్ సహాయంతో పొలాన్ని దున్నుతున్న దృశ్యం

Telangana: ఆదిలాబాద్ జిల్లాలో రైతుల గోస మరీ దయనీయంగా మారింది. ఈ మధ్యనే తను పెంచుకున్న ఎద్దు చనిపోవడంతో తన కొడుకును రెండో స్థానంలో ఉంచి పొలం దున్నిన వీడియోను మనం ఈ మధ్య చూశాం. తాజాగా ఓ రైతు తన వ్యవసాయ పొలాన్ని దున్నడానికి తన వద్ద ఉన్న బైక్ సహాయంతో 60 గుంటల చేనును గంటలో దున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

కరోనా కాలంలో చేతిలో చిల్లి గవ్వ లేకుండా అయిపోయింది. ఏదైనా వస్తువు తీసుకుందామంటే ఆలోచించాల్సిన పరిస్థితి. ఓ రైతు తన వద్ద డబ్బులు లేక ఎద్దులు కొనలేకపోయాడు. దీంతో వ్యవసాయం చేసేందుకు ఇబ్బందులు తలెత్తాయి. అతడు అందరిలీ కాకుండా వినూత్నంగా ఆలోచించారు. తన వద్ద ఉన్న బైక్ ను వ్యవసాయ పనులకు ఉపయోగించాడు. బైక్‌తో పొలంలో చౌకగా దున్నేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. పొలం మొత్తం తన బైక్ సహాయంతో దున్ని అందరితో ఔరా అనిపించుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతని ఆలోచనకు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయ రంగంలోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సంప్రదాయ పద్దతుల్లో సాగు చేసే రైతులు ఆధునిక పద్దతులను అలర్చుకుంటున్నారు. అందివచ్చిన సాంకేతిక నైపుణ్యాన్ని వ్యవసాయానికి అన్వయించుకొని అధిక దిగుబడులను సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదే క్రమంలో ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు మండల కేంద్రానికి చెందిన మేకల మల్లేశ్ అనే రైతు ఎద్దులు లేకుండా వినూత్నంగా ఆలోచించి సరికొత్త పద్దతిలో పొలంలో దౌర కొట్టి ఔరా అనిపించుకున్నాడు. మల్లేష్ తనకున్న పత్తి చేనులో గడ్డిని తొలగించడానికి నాగలి కట్టేందుకు ఎడ్లు లేవు. ఇప్పటికిప్పుడు ఎడ్లను కొనుగోలు చేసేందుకు తన వద్ద డబ్బులు లేవు. పోని అద్దెకు తీసుకువద్దామనుకున్నా రోజుకు రెండు వేల రూపాయలు చెల్లించాలి. ట్రాక్టర్‌ను పిలిపించే స్తోమత లేక, కనీసం ఎద్దులతో పొలం దున్నించే వెసులుబాటు కూడా లేక ఓ రైతు తన అందుబాటులో ఓ పద్ధతిని ఎంచుకున్నాడు. అద్దె భారాన్ని తగ్గించుకునేందుకు సరికొత్త ఆలోచనను ఆచరణలో పెట్టాడు. ద్విచక్ర వాహనానికి దౌర కట్టి ఎకరంన్నర పంట చేనులో పని పూర్తి చేశాడు.


కేవలం 100 రూపాయల ఖర్చుతో పనిపూర్తికావడంతో రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. బైక్‌తో అరవై గుంటల భూమిలో గంటలో పని కానిచ్చేశాడు. ఈ ఒక గంటకు పెట్రోల్ ఖర్చు కేవలం వంద రూపాయలు కావడం విశేషం. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో పొలంలో దౌర పని పూర్తవుతుందని రైతు అనందం వ్యక్తం చేశాడు. రైతు మల్లేశం ఐడియాతో మిగతా రైతులు సైతం ఇదేదారిలో పయనించడానికి సిద్దమవుతున్నారు. సాగు కోసం అప్పులు చేసి కష్టాలను కొనితెచ్చుకుంటున్న ఈ రోజుల్లో ఇలా సరికొత్త ఆలోచనతో ముందుకుపోతున్న ఈ రైతును పనిని చూసి అందరూ మెచ్చుకుంటున్నారు.

First published:

Tags: Adilabad, Farmers, IDEA, Viral Video

ఉత్తమ కథలు