Home /News /telangana /

ADILABAD COLLECTOR HIMSELF DROPPED HIS SON WHO WAS NOT GOING TO SCHOOL IN THE CLASSROOM SNR ADB

Adilabad: స్కూల్‌కి వెళ్లనని చిన్నారి మారం .. బుజ్జగించి క్లాస్‌లో వదిలివెళ్లిన కలెక్టర్

(కలెక్టర్‌కి తప్పని కష్టాలు)

(కలెక్టర్‌కి తప్పని కష్టాలు)

Adilabad: ఆమె ఓ జిల్లా కలెక్టర్. కాని తాను ఓ బిడ్డకు తల్లేనని నిరూపించుకున్నారు. సెలవుల తర్వాత స్కూల్స్‌ రీఓపెన్ కావడంతో బిడ్డను స్కూల్‌కు పంపేందుకు కాస్త ఇబ్బంది పడ్డారు. పాఠశాలకు వెళ్లనని మారాం చేసిన కుమారుడ్ని బుజ్జగించి తరగతి గదిలో వదిలివెళ్లారు.

ఇంకా చదవండి ...
    (K.Lenin,News18,Adilabad)
    స్కూళ్లకు సెలవులు ఇచ్చిన దగ్గర నుంచి ఆట,పాటలతో ఎంజాయ్ చేసిన పిల్లలు మళ్లీ పాఠశాలలు తెరవగానే స్కూళ్లకు వెళ్లాలంటే ఒకింత అఇష్టంగా ఫీలవుతూ ఉంటారు. స్కూల్స్ తెరిచిన మొదటి రోజు కొంత మంది ఉత్సాహంగా పాఠశాలకు వెళితే, మరికొంత మంది చిన్నారులు వెళ్ళమని మారం చేశారు. పిల్లలు మారం చేయడం తల్లిదండ్రులు దగ్గరుండి మరీ తరగతి గది వరకు తీసుకెళ్లి ఉపాధ్యాయులకు అప్పగించి వెళ్లారు. ఆదిలాబాద్Adilabad జిల్లా కలెక్టర్‌ (Collector) సిక్తా పట్నాయక్‌(Sikta Patnaik)కు ఇదే పరిస్థితి ఎదురైంది. కలెక్టర్‌ గారబ్బాయి స్కూల్‌(School)కి వెళ్లకుండా మేడమ్‌ని ముప్పు తిప్పలు పెట్టడంతో ఆమె దగ్గరుండి క్లాస్ టీచర్‌(Class Teacher‌)కి అప్పగించాల్సిన పరిస్థితి తలెత్తింది.

    స్కూల్‌కి వెళ్లనని గొడవ..
    కలెక్టర్ సిక్తా పట్నాయక్ కుమారుడు సారంగ్‌ ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో చదువుతున్నాడు. హాలీడేస్ తర్వాత స్కూల్‌కి వెళ్లడానికి ఇష్టపడకపోవడంతో కలెక్టరే స్వయంగా స్కూల్‌కు తీసుకొచ్చారు. క్లాస్‌ టీచర్‌కి అప్పగించడానికి తానే స్వయంగా తరగతి గది వరకు వెంట తీసుకెళ్లారు. అయితే కలెక్టర్ కుమారుడు క్లాస్‌ రూమ్‌లోకి వెళ్లనని మారాం చేయడంతో సిక్తా పట్నాయక్ అక్కడే కొద్దిసేపు ఉండి బిడ్డను బుజ్జగించారు. నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

    బిడ్డను బుజ్జగించిన కలెక్టర్..
    కలెక్టర్‌ కుమారుడు సారంగ్‌ మొదట కొద్దిసేపు మారాం చేసినప్పటికి చివరకు అమ్మ మాట విని తరగతి గదిలోకి వెళ్ళాడు. చిన్నారిని మహిళా ఉపాధ్యాయులు కూడా దగ్గరుండి క్లాస్‌ రూమ్‌లోకి తీసుకువెళ్ళారు. జిల్లాకు కలెక్టర్ అయి ఉండి ఏమాత్రం అధికారం, హంగు ఆర్భాటం ప్రదర్శించలేదు సిక్తా పట్నాయక్. బిడ్డను స్కూల్‌కి తీసుకెళ్లేందుకు ఓ సాధారణ తల్లిలా పాఠశాలకు వచ్చి తన కొడుకు దింపి వెళ్లిన కలెక్టర్ తీరును చూసి అందరు ఆశ్చర్యపోయారు.

    ఇది చదవండి: పాలమూరు జిల్లాలో పచ్చి మోసం .. యాప్‌ ద్వారా 10కోట్లతో వేలాది మందికి పంగనామం



    వైరల్ అవుతున్న వీడియో..
    కరోనా కారణంగా రెండేళ్లు స్కూల్స్‌ తెరుచుకోలేదు. అడ్మిషన్లు, హడావుడి లేకుండానే గత అకడమిక్ ఇయర్ ముగిసింది. కరోనా ప్రభావం అంతగా లేకపోయినప్పటికి నిబంధనలు పాటిస్తూనే ప్రభుత్వం స్కూళ్లను ముందుగా ప్రకటించిన డేట్‌కే ప్రారంభించింది. తొలిరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తెరుచుకుని, విద్యార్థులతో సందడిగా మారాయి. మరోవైపు ప్రభుత్వం కూడా బడిబాట కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుండటంతో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు తమ పిల్ల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు తమ పిల్లలను పంపించేలా వారిని చైతన్య పరిచారు. ఇందుకోసం పలు కార్యక్రమాలను కూడా నిర్వహించారు. మరోవైపు ప్రభుత్వం కూడ ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పన కోసం పలు కార్యక్రమాలను చేపట్టింది. ఈయేడు ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంమీద ఈ యేడు ఏ ఆటంకం లేకుండా మరో విద్యాసంవత్సరం సాఫీగా ప్రారంభంకావడంతో అందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Adilabad, Collector, Schools reopening

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు