హోమ్ /వార్తలు /తెలంగాణ /

BRS MLA: రాత్రికి అమ్మాయిలను పంపించమన్నాడు..బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు..అసలేం జరిగింది?

BRS MLA: రాత్రికి అమ్మాయిలను పంపించమన్నాడు..బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు..అసలేం జరిగింది?

బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు!

బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు!

మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కారు. సదరు ఎమ్మెల్యే తనను వేధించాడని ఆరోపణలు చేస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో, ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది. ఈ వ్యవహారం ఎటు తిరిగి ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి మరి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Adilabad, India

Bellampally MLA: అధికార బిఆర్ఎస్ పార్టీకి చెందిన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శాసన సభ్యుడు దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధించినట్లు ఆరోపణలు చేస్తూ ఓ మహిళ వీడియోను కూడా విడుదల చేసింది. తమపై తప్పుడు కేసులు పెట్టించాడని ఆరోపించారు. కాగా ఎమ్మెల్యే వాట్సప్ చాట్, ఆడియో కూడా వైరల్ అయ్యింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ కు చెందిన ఆదినారాయణ అనే వ్యక్తి గత యేడాది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఓ డెయిరీని ప్రారంభించారు. పక్కనే బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ నిర్మాణానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యే భూమి పూజ చేశారు. యూనిట్ కోసం ఎమ్మెల్యేనే రెండు ఎకరాల అసైన్డ్ భూమిని ఇప్పించారనే ప్రచారం కూడా జరిగింది. అయితే బర్రెల యూనిట్లు ఇప్పిస్తామని డెయిరీ నిర్వాహకులు తమ వద్ద నుండి డబ్బులు వసూలు చేసి మోసం చేశారని పలువురు పాడి రైతులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు డెయిరీ నిర్వాహకులను అరెస్టు చేసి జైలుకు కూడా పంపించారు. ఇదిలా ఉంటే ఇటీవల బెయిల్ పై విడుదలైన వారు ఎమ్మెల్యే తమను వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ ఆడియో, వీడియోలను విడుదల చేశారు.

Hyderabad: హైదరాబాద్‌లో మార్చి 30 మద్యం షాపులు బంద్.. !

డబ్బులు అడిగితే ఇవ్వనందుకే ఎమ్మెల్యే చిన్నయ్య తమపై అక్రమంగా కేసులు పెట్టించాడని ఆరోపించారు. తనను వేధింపులకు గురి చేశారంటూ డెయిరీ నిర్వాహకుల్లో ఒకరైన మహిళ ఆడియోను విడుదల చేసింది. డెయిరీ ఏర్పాటుకు సహకరించినందుకు వ్యాపారం తన సంబంధీకులకు వాటా ఇవ్వాలని, తన వద్దకు అమ్మాయిలను పంపించాలని, తన కోరికలు తీర్చాలని వేధించినట్లు ఆరోపించారు. వేధింపులు భరించలేక బ్రోకర్ ద్వారా ఎమ్మెల్యే వద్దకు అమ్మాయిలను కూడా పంపినట్లు అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో, ఆడియో వైరల్ కావడం కలకలం రేపింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ తనకు వీటితో ఎలాంటి సంబంధం లేదని, తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు గిట్టిని వారు చేస్తున్న కుట్ర అని అభివర్ణించారు.

కాగా రైతులకు ఎమ్మెల్యే చిన్నయ్య అండగా నిలిచినందుకే లైంగిక ఆరోపణలు చేస్తున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే తీరుపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అటు బిఆర్ఎస్ అధిష్టానం కూడా ఈ ఘటనపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై ఇలా ఆరోపణలు రావడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారం ఎటు తిరిగి ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి మరి.

First published:

Tags: Adilabad, BRS, Telangana

ఉత్తమ కథలు