Home /News /telangana /

ADDITIONAL SP OF SIDDIPET GOES ON BIKE AS COMMON MAN VRY KMM

Lock down : నెత్తికి రుమాలు..సాధారణ బైకుతో అదనపు ఎస్పీ..పోలీసులకు ముచ్చెమటలు

నెత్తికి రుమాలు..సాధారణ బైకుతో అదనపు ఎస్పీ..పోలీసులకు ముచ్చెమటలు

నెత్తికి రుమాలు..సాధారణ బైకుతో అదనపు ఎస్పీ..పోలీసులకు ముచ్చెమటలు

Lock down : లాక్డౌన్‌లో పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారు..సాధారణ ప్రజలకు వారు ఎలా సేవలు అందిస్తున్నారు. చేక్‌పోస్టుల వద్ద పోలీసులు నిబంధనలు పాటిస్తున్నారా..లేదంటే ప్రజలతో దురుసుగా వ్యవహరిస్తున్నారా...? ఇవన్ని చెక్ చేసేందుకు ఓ ఎస్పీ రంగంలోకి దిగాడు..అయితే ఆ ఎస్పీ తానేవరో కూడ తెలియకుండా ఓ సాధారణ పౌరుడిలా మఫ్టిలో 10 చెక్‌పోస్టులు దాటాడు.

ఇంకా చదవండి ...
లాక్‌డౌన్ అంటే గుర్తుకు వచ్చేది ముందుగా పోలీసులే..వారు లేకుండా ఏ కార్యక్రమం సక్సెస్ కావడానికి అవకాశం లేదు.. దీంతో లాక్‌డౌన్ ప్రకటించగానే రంగంలోకి దిగిన పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు..మహిళలు, చిన్న పిల్లలు, అని కూడ చూడకుండా కర్కషంగా విధులు నిర్వహిస్తున్నారు. కారణం లేనిదే ఎవ్వరిని చెక్‌పోస్ట్ దాటి బయటకు వెళ్లనీయడం లేదు.. అయితే ఇదంతా చేసేది సాధరణ ప్రజానికం కోసమే అయినా..కొన్ని సార్లు అవి కొద్దిమంది పోలీసుల వల్ల మితిపోయో పరిస్థితి కూడ నెలకొంటుంది..

దీంతో ప్రజలు పోలీసుల నిబంధనలపై అక్కడక్కడా విరుచుకుపడుతున్నారు. క్రిందిస్థాయి పోలీసుల తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాధులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లాక్డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని ఓవైపు డీజీపీ ఆదేశాలు జారీ చేయడంతో మరింత కఠినం చేశారు పోలీసులు..దీంతో పాసులు ఉన్నవారికే అనుమతులు ఇస్తున్నారు. అయితే వేలాదిగా మంది ప్రజలు తమ అవసరాల కోసం బయటకు వస్తున్నారు..సరైన అవసరాలు ఉన్నవారిని పోలీసులు వదిలేస్తున్నారు.

దీంతో లాక్ డౌన్ పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు సిద్దిపేట అదనపు ఎస్పీ రామేశ్వర్ తలకు రుమాలు, ఆఫ్ షర్ట్‌తో పాటు మాములు బైక్‌పై మారువేషంలో ప్రయాణిస్తూ.. వెళ్లి అందరిని అశ్చర్యానికి గురి చేశాడు. పలు చోట్ల పలు కారణాలు చెబుతూ పది చెక్‌పోస్టులు దాటాడు. ఇలా ఓ చోట మందుల కొనుగోలు అని, మరోచోట మెకానిక్ అని మరోచోట వ్యక్తిగత పైరవీలతో చెక్‌పోస్టులు దాటుతూ వెళ్లాడు..అయితే అక్కడ పోలీసులు తగిన అధారాలు చూపించిన తర్వాతే పంపించారు..దీంతో లాక్‌డౌన్ నిబంధనల అమలు తీరుపై పోలీసులు పక్కగా అమలు చేస్తున్నట్టు ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు.
Published by:yveerash yveerash
First published:

Tags: Lock down, Siddipet

తదుపరి వార్తలు