Home /News /telangana /

ACTOR PRAKASH RAJ ADVISED PRIME MINISTER NARENDRA MODI TO LEARN FROM TELANGANA CM KCR RULE PRV

Prakash raj: ప్రధాని మోదీపై నటుడు ప్రకాశ్​ రాజ్ విమర్శలు.. ట్విట్టర్​లో పోస్టు.. 

ప్రకాశ్​ రాజ్​, పీఎం మోదీ (ఫైల్​)

ప్రకాశ్​ రాజ్​, పీఎం మోదీ (ఫైల్​)

నటుడు ప్రకాశ్‌ రాజ్‌ దేశ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు . తాజాగా హైదరాబాద్​లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై వ్యంగ్యంగా కామెంట్స్‌ చేశారు.

    నటుడు, విమర్శకుడు ప్రకాశ్‌ రాజ్‌ (Prakash raj) దేశ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు . తాజాగా హైదరాబాద్​ (Hyderabad)లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు (BJP National executive meeting 2022) వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra modi)పై ప్రకాశ్​ రాజ్​ వ్యంగ్యంగా కామెంట్స్‌ చేశారు. బీజేపీ (BJP), మోదీపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ట్విట్టర్‌ (Twitter) వేదికగా.. తెలంగాణలో అద్భుత పాలన నడుస్తోందని చెబుతూ.. హైదరాబాద్‌కు వస్తున్నఅత్యుత్తమ నాయకుడికి ప్రకాశ్​ రాజ్​ స్వాగతం అన్నారు. ఈ క్రమంలోనే పాలన ఎలా ఉండాలో చూసి నేర్చుకోవాలని పరోక్షంగా మోదీకి ప్రకాశ్​ రాజ్​ సూచించారు. అలాగే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటనలను సైతం ఆయన ప్రస్తావించారు.



    మోదీ పర్యటిస్తున్న సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు కట్టిన పన్నుల మొత్తంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్లు వేస్తుంటారు. కానీ, తెలంగాణ (Telangana)లో మాత్రం ప్రజల అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తారని ప్రకాశ్​ వ్యాఖ్యానించారు. ఈ పర్యటనను ఆస్వాదించాలని, దూరదృష్టితో మౌలిక సదుపాయాలు ఎలా అందించాలో చూసి నేర్చుకోవాలని పరోక్షంగా మోదీని ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు ప్రకాశ్​ రాజ్​. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ (CM KCR) ఫొటో, యాదాద్రి, టీ హబ్, కాళేశ్వరం ప్రాజెక్టు,  ప్రభుత్వ ఆసుపత్రి, గురుకుల పాఠశాల భవనాలతో కూడిన ఫొటోలను ఆయన ట్వటర్​లో షేర్‌ చేశారు.

    నేడు మధ్యాహ్నం హైదరాబాద్​కు మోదీ..

    కాగా, హైదరాబాద్‌ (Hyderabad)లో నేటి నుంచి జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు (BJP National Executive meeting 2022), బహిరంగ సభ దృష్ట్యా నగరవ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రెండు రోజులూ వీఐపీలు చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ పహారా కాస్తున్నారు. నేడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం అమ్మవారిని దర్శించుకోనున్నారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) నేడు హైదరాబాద్ రానున్నారు. శనివారం, ఆదివారం జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోదీ పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో శుక్రవారం నుంచి 4వ తేదీ వరకు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. అదేవిధంగా నోవాటెల్ హోటల్లో బస చేయనున్న మోదీకి మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Actor prakash raj, BJP National Executive Meeting 2022, Hyderabad, PM Narendra Modi, Telangana Politics

    తదుపరి వార్తలు