మళ్లీ లాక్‌డౌన్‌ వద్దు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

నాగబాబు (Twitter/nagababu)

గతంలో ప్రభుత్వాలు ఇంచు మించు 60 నుంచి 90 రోజులు పాటు లాక్‌డౌన్ విధించడం వల్ల ప్రజలు ఎంతగానో నష్టపోయారని గుర్తు చేశారు.

  • Share this:
    హైదరాబాద్ పరిధిలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే ఊహాగానాలపై మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వస్తున్న వార్తలను బట్టి మళ్లీ లాక్‌డౌన్ పెట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని తనకు అర్థమవుతుందన్న నాగబాబు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ లాక్‌డౌన్ విధిస్తే అది చారిత్రాత్మక తప్పిదం అవుతుందని హెచ్చరించారు. అసలు లాక్‌డౌన్ లక్ష్యం ఏంటని ప్రశ్నించిన నాగబాబు.. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయడం, రెండోది ఈ గ్యాప్‌లో 60 నుంచి 90 రోజులు చేసిన లాక్‌డౌన్‌లో వైద్య అవసరాలను అన్ని రకాలుగా సమకూర్చుకోవడానికి లాక్‌డౌన్ విధించినట్లుగా తాను భావిస్తున్నానని తెలిపారు.

    గతంలో ప్రభుత్వాలు ఇంచు మించు 60 నుంచి 90 రోజులు పాటు లాక్‌డౌన్ విధించడం వల్ల ప్రజలు ఎంతగానో నష్టపోయారని గుర్తు చేశారు. మళ్లీ లాక్‌డౌన్ పెట్టి, జనజీవనాన్ని స్థంబింపజేయడం అనే ఆలోచన చేయడం కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు. చాలా దేశాలు లాక్‌డౌన్ లేకుండా కూడా మహమ్మారిని ఎదుర్కొంటూ దేశాన్ని సక్సెస్‌పుల్‌గా నడిపిస్తున్నాయని అన్నారు.
    First published: