త్వరలో బీజేపీలోకి విజయశాంతి?... కాంగ్రెస్‌కి గుడ్ బై?

Vijayashanthi : ఆపరేషన్ ఆకర్ష్‌ని చాపకింద నీరులా ప్రవహింపజేస్తున్న బీజేపీ... తెలంగాణలో పవర్‌ఫుల్ నేతల్ని తనవైపు లాగేసుకుంటోందా? రాములమ్మ ఎంట్రీతో బీజేపీ మరింత బలంగా మారబోతోందా?

Krishna Kumar N | news18-telugu
Updated: September 28, 2019, 2:38 PM IST
త్వరలో బీజేపీలోకి విజయశాంతి?... కాంగ్రెస్‌కి గుడ్ బై?
విజయశాంతి (File)
  • Share this:
Telangana Politics : ఎన్నికలు అయిపోయాక నేతలు పార్టీలు మారడం కామన్. ఐతే... ప్రతిపక్షం నుంచీ అధికారపార్టీలోకి నేతలు జంప్ అవుతూ ఉంటారు. తెలంగాణలో మాత్రం... ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచీ... అధికార టీఆర్ఎస్‌లో కంటే... కేంద్రంలో అధికారంలో ఉండి... రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీలోకి కొందరు సీనియర్ నేతలు జంప్ అవుతున్నారు. ఇందుకు ఎవరి లెక్కలు వాళ్లకున్నాయి. తాజాగా సీనియర్ సినీ నటి, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కాంగ్రెస్‌కి గుడ్‌పై చెప్పి... బీజేపీలోకి జంప్ అవ్వబోతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి కొన్ని రోజులుగా జరుగుతున్న మంతనాలు కొలిక్కి వచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందనే ప్రచారం జరుగుతున్న సమయంలో... రాములమ్మకీ... పార్టీ నాయకత్వానికీ మధ్య సరైన సఖ్యత లేకపోవడం వల్ల... ఆమె బీజేపీ గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది.

రాజకీయాలన్నాక... యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉంటేనే లైఫ్ ఉంటుంది. లేదంటే ప్రజలు ఆ నేతను మర్చిపోతారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో... కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా విజయశాంతి దూకుడు ప్రదర్శించారు. తనదైన మాటకారితనంతో... టీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు. ఐతే... ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పొందడం, కేంద్రంలో బీజేపీకి భారీ మెజార్టీ రావడంతో... రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం వంటి అంశాలతో... విజయశాంతి సహా చాలా మంది కాంగ్రెస్ నేతలకు... పార్టీ భవిష్యత్తుపై నమ్మకాలు సడలిపోయాయి.

ఓవైపు కాంగ్రెస్ డౌన్ అవుతున్న సంకేతాలు కనిపిస్తుంటే... అదే సమయంలో బీజేపీ ఆపరేషన్ ఆకర్షను సమర్థంగా నడిపిస్తూ... కచ్చితంగా 2023లో తెలంగాణలో అధికారంలోకి రావాలనే టార్గెట్‌తో ముందుకు సాగుతుంటే... టీఆర్ఎస్‌లో చేరలేమనుకునే నేతలు ఆ పార్టీవైపు చూస్తున్నారు. అందువల్ల విజయశాంతి బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

బీజేపీతోనే ఎంట్రీ : అసలు రాములమ్మ రాజకీయాల్లోకి వచ్చిందే బీజేపీతో. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడేందుకు సొంతంగా పార్టీ పెట్టి... తర్వాత దాన్ని టీఆర్ఎస్‌లో కలిపేసి... కేసీఆర్‌కి జై కొట్టారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ నుంచీ టీఆర్ఎస్ ఎంపీ అయ్యారు. ఐతే... పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదని భావించిన ఆమె... కారు దిగి... కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు దసరా నాడు బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
Published by: Krishna Kumar N
First published: September 28, 2019, 2:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading