Custodial Death : బాత్రూం కోసమని వెళ్లి పోలీసుల కళ్లు గప్పాడు.. తీరా చూస్తే... ?

Custodial Death : బాత్రూం కోసమని వెళ్లి పోలీసుల కళ్లు గప్పాడు.. తీరా చూస్తే... ?

Custodial Death : పోలీసులు అదుపులో ఉన్న నిందితుడు వారిని ఇరకాటంలో పెట్టాడు.. ముగ్గురు పోలీసులు కాపాల ఉన్న ఓ లాడ్జ్‌లోనే బాత్రూం కోసమని వెళ్లి ఉరివేసుకుని చనిపోయాడు.. దీంతో కస్టోడియల్ డెత్ కేసు బుక్ అయింది.

  • Share this:
    ఒక్కోసారి నిందితులు పోలీసులను బుక్ చేస్తారు.. ఎంత జాగ్రత్తగా ఉన్నా నమ్మించి మోసం చేస్తారు..ఇలాగే దోంగతనం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి పోలీసుల కళ్లు గప్పి బాత్రూంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పోలీసుల అదుపులో ఉన్న సంఘటన జరగడంతో పోలీసులే ఏమైనా చేశారా... లేక నిందితుడే ఆత్మహత్య చేసుకున్నాడా అనే తేలాల్సి ఉంది..

    వివరాల్లోకి వెళితే.. హైదారాబాద్‌కు Hyderbad చెందిన రమేష్ రెడ్డి వ్యక్తి రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యాపారీ ( Businessman )వద్ద ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇటివల రమేష్ రెడ్డి తన యజమాని ఖాతా నుండి ఏడు లక్షల రూపాయలు స్వాహా చేశాడనే ఆరోపణలు చేస్తూ రాజస్థాన్‌లో ( Rajastana ) కేసు నమోదు అయింది.

    ఇది చదవండి : విచిత్ర జీవితం.. అవమానంతో అడవికి.. 17 సంవత్సరాలుగా ఒంటరి జీవితం


    రమేష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి గురువారం ఉదయం, రాజస్థాన్ నుండి ఒక అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్లు హైదరాబాద్ వచ్చారు. వీరు స్థానిక మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ లోని పోలీసులు సాయంతో రూ .7 లక్షలు మోసం చేసిన కేసులో రమేష్‌ను అరెస్టు చేశారు.

    రాత్రి 7.30 గంటల సమయంలో, పోలీసులు రమేశ్ రెడ్డిని నాంపల్లిలోని ( nampally ) ఓ లాడ్జికి తీసుకువచ్చారు. కానీ జైలు ట్రాన్సిట్ వారెంట్ తీసుకోలేదు. దీనికి గాను అతడిని సంబంధిత స్థానిక కోర్టు ముందు హాజరుపరచలేదు.ఈ క్రమంలోనే రమేశ్ రెడ్డికి ముగ్గురు పోలీసులు ( police ) రాత్రంతా కాపలాగా ఉన్నారని అధికారులు తెలిపారు. కాగా శుక్రవారం ఉదయం 5.30 గంటలకు, ASI నిద్రలేచి వాష్‌రూమ్‌కు వెళ్లివచ్చాడు. ఆ తరువాత, రమేష్ రెడ్డి కూడా వాష్‌రూమ్ వెళతానని పోలీసులను అడిగాడు.

    అలా వెళ్లిన రమేష్ రెడ్డి వాష్‌రూమ్‌ను లోపలి నుండి లాక్ ( lock ) చేసాడు. అయితే, ఎంతసేపటికి అతను బయటకు రాకపోవడంతో, పోలీసులు బలవంతంగా తలుపులు తెరిచారు. అక్కడ, నిందితుడు ఉరి ( suicide ) వేసుకుని కనిపించాడని సెంట్రల్ జోన్ జాయింట్ కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు.

    సమాచారం అందుకున్న తర్వాత నాంపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బాత్రూం నుండి బయటకు తీశారు. పోలీసులు అదుపులో ఉన్నప్పుడు నిందితుడు చనిపోయాడు కాబట్టి కస్టోడియల్ ( custodial death ) డెత్ కింద కేసు నమోదు చేశారు..
    Published by:yveerash yveerash
    First published: