Hyderabad: మూడేళ్ల బాలుడిని కొట్టి చంపిన తల్లి, ఆమె ప్రియుడి అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

Hyderabad: మూడేళ్ల బాలుడిని కొట్టి చంపిన తల్లి, ఆమె ప్రియుడి అరెస్ట్..

Hyderabad: అమ్మతనానికి మచ్చ తెచ్చి... తన స్వేఛ్చ జీవితానికి అడ్డువస్తున్నాడని అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిని వైర్లతో విచక్షణ రహితంగా కొట్టి చప్పిన తల్లితో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు....అనంతరం ఇద్దరిని రిమాండ్‌కు పంపారు.

  • Share this:
అమ్మతనానికి మచ్చ తెచ్చి... తన స్వేఛ్చ జీవితానికి అడ్డువస్తున్నాడని అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిని వైర్లతో విచక్షణ రహితంగా కొట్టి చప్పిన తల్లితో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు....అనంతరం ఇద్దరిని రిమాండ్‌కు పంపారు.

జూన్‌ ఎనిమిది తన అక్రమసంబంధానికి అడ్డువస్తున్నాడని మూడేళ్ల తన స్వంత కొడుకును వైర్లతో విపరీతంగా దెబ్బలకు తాళాలేక చిన్నారి ఏడుస్తుంటే తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లింది... కాని అప్పటికే ఆమె కొపానికి బలైపోయాడని వైద్యులు చెప్పారు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూరారంలో ఉంటున్న సురేష్,కంజర్ల ఉదయలు భార్యభర్తలు వీరికి ఉమెష్ అనే మూడెళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.. అయితే భార్యభర్తల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఇద్దరు సంవత్సర కాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈనేపథ్యంలోనే చింతల్ మారుతి నగర్‌‌కు చెందిన భాస్కర్ అనే వ్యక్తితో ఉదయకు పరిచయం ఏర్పడింది. కాస్త అక్రమ సంబంధంగా మారింది. దీంతో ఉదయం భర్త నుండి వేరుపడి కోడుకుతో కలిసి భాస్కర్‌తోనే ఉంటుంది. అయితే తమ సంబంధానికి అడ్డుగా ఉంటాడనే కోపంతో ఉదయ తన స్వంత కొడుకు అని చూడకుండా పిల్లాడిని చిత్రహింసలకు గురి చేసేది..దీనికి తోడు భర్త దూరంగా ఉండడం కూడా ఆమె మానసిక వేదనకు గురయినట్టు స్థానికులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఉమేష్‌ను మరోసారి గతమమంగళవారం ఉదయం అందుబాటులో ఉన్న కరెంటు వైర్లతో చితకబాదింది.తాను ఏం చేస్తున్నానో తెలియకుండా విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు కొట్టింది. అనంతరం కాసేపటికే ఉమేష్ సోమ్మసిల్లిపోయాడు..అయినా..ఉదయం నుండి సాయంత్రం వరకు అలాగే ఉంచింది.. చివరికి సాయంత్రం నాలుగు గంటలకు సమీపంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు గుర్తించారు..

కాగా బాలుడిపై విపరీతమైత దెబ్బలు ఉండడంతో అనుమానం వచ్చిన వైద్యులు సూరరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.... పోలీసుల విచారణలో పిల్లాడి చావుకు తల్లి ఉదయతో పాటు ప్రియుడు భాస్కర్‌లు కారణమని నిర్ధారించారు. నాలుగు రోజుల పాటు కేసును విచారించి రిమాండ్‌కు పంపించినట్టు చెప్పారు.
Published by:yveerash yveerash
First published: