హోమ్ /వార్తలు /తెలంగాణ /

Danger Spot : అది యమపురికి రహదారి .. అటుగా వెళ్లాలంటే భయపడిపోతున్న వాహనదారులు

Danger Spot : అది యమపురికి రహదారి .. అటుగా వెళ్లాలంటే భయపడిపోతున్న వాహనదారులు

mahbubnagar bypass road

mahbubnagar bypass road

Danger Spot: మహబూబ్‌నగర్ పట్టణంలోని ట్రాఫిక్‌ను తగ్గించడానికి రింగ్‌రోడ్డును ఏర్పాటు చేశారు. రహదారిని అందంగా నిర్మించినప్పటికి భద్రత పరంగా అధికారులు ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టలేదు. దీంతో ఈ మార్గంలో వాహనాలు అతివేగంగా నడుపుతూ ప్రమాదాల బారినపడుతున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Mahbubnagar, India

  (Syed Rafi, News18,Mahabubnagar)

  మహబూబ్‌నగర్(Mahabubnagar)జిల్లా దేవరకద్ర గ్రామానికి చెందిన ఓ యువకుడు దీపావళి రోజు రాత్రి విశ్వాస్ ఆస్పత్రి(Vishwas Hospital)లో చికిత్స పొందుతున్న తమ వారిని పరామర్శించి స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. హౌసింగ్ బోర్డ్(Housing Board)ప్రధాన కూడలిలో ఏర్పాటుచేసిన బారీకేడు కిందపడి ఉంది. అక్కడ వెలుతురు లేకపోవడంతో బారికేడ్‌కు ఢీకొని తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మూడు నెలల కిందట మహబూబ్‌నగర్ మండలం ఇద్దరే గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి(Narsimha Reddy)బైక్‌పై బయలుదేరాడు. హౌసింగ్ బోర్డ్ బైపాస్‌ దగ్గర రోడ్డు(Bypass Road ) దాటుతున్న సమయంలో వెనుక వైపు నుంచి దూసుకొచ్చిన ఒకరు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో కింద పడిపోయిన నరసింహారెడ్డి కాలు విరిగిపోయింది. ఇలాంటి ప్రమాదాలు ఇక్కడ నిత్యం చోటు చేసుకుంటున్నాయి.

  Munugodu: మోటార్లకు మీటర్లపై మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి స్పందన ఇదే..

  డేంజర్ స్పాట్..

  మహబూబ్‌నగర్ పట్టణంలోని ట్రాఫిక్ ను తగ్గించడానికి రింగ్‌రోడ్డును ఏర్పాటు చేశారు. రహదారిని అందంగా నిర్మించిన భద్రత పరంగా అధికారులు ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టలేదు. దీంతో ఈ మార్గంలో వాహనాలు అతివేగంగా నడుపుతున్నారు. కూడలి దగ్గర, మలుపులు తిరుగుతున్న సమయంలో ఇతర వాహనాలను ఢీకొని ప్రమాదాల బారినపడుతున్నారు వాహనదారులు. ఒకరకంగా చెప్పాలంటే ఈ బైపాస్‌ వాహనదారుల పాలిట డేంజర్‌ స్పాట్‌గా మారింది. అనేక ప్రమాదాల్లో ఇప్పటికే కొందరు మృత్యువాత పడగా మరికొందరు తీవ్రగాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

  వెలుతురు కరువు, సూచికలు లేవు...

  హైదరాబాద్ వెళ్లడానికి రాయచూరు మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన అనేకమంది క్రిస్టియన్‌పల్లి సమీపంలోని బైపాస్ రహదారి గుండానే వెళ్తున్నారు. జడ్చర్ల నుంచి వచ్చే వారు కూడా ఈ బైపాస్ రహదారిపై నుంచి ప్రయాణిస్తున్నారు. ప్రధానంగా ఎస్వీఎస్ ఆసుపత్రి సమీపం నుంచి పాలకొండ వరకు ఉన్న బైపాస్ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. ఇదిరా డ్యూటీ పల్లి హౌసింగ్ బోర్డ్ సిద్దయ్యపల్లి అప్పన్నపల్లి ఎర్రగొండ ప్రాంతాలకు చెందిన వాళ్లు నిత్యం ఇదే మార్గంలో వెళ్తుంటారు. అయితే ఈ బైపాస్‌ రోడ్డుపై హైమాస్ట్ లైట్లు లేక రాత్రిపూట అంధకారంగా ఉంటుంది. ఎటువైపు నుంచి ఏ వాహనం దూసుకొస్తుందోనని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

  Bhadradri: స్వార్థ ప్రయోజనాల కోసమే మావోయిస్టులు ఆదివాసీలను వాడుకుంటున్నారు: కొత్తగూడెం ఎస్పీ

  మందు పార్టీలకు అడ్డగా...

  బైపాస్ రహదారి ఇరువైపులా చాలా అందంగా బాగుంది కానీ వేగ నియంత్రకులు లేకపోవడంతో వాహనాలు రయ్యమంటూ దూసుకుపోతున్నాయి. బైపాస్ సమీపంలో ఇరువైపులా అనుమతి లేని మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటిలో మద్యం తాగి వానాలపై వచ్చేవారు ప్రమాదాలకు గురవుతున్నారు. సాయంత్రం అయితే చాలామంది మందుబాబులు మద్యం తీసుకొని ఈ రహదారికి చుట్టుపక్కల ఉన్న వెంచర్లలో పార్టీలు చేసుకుని రాత్రి వస్తున్నారు. డాబాల్లో ఈ వ్యవహారం నిత్యం కొనసాగుతూనే ఉంది.

  పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం...

  మహబూబ్‌నగర్..బైపాస్ రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు. వేగాన్ని నిరోధించడానికి ప్రధాన కూడల్లో వద్ద బారికేడ్లను ఏర్పాటు చేస్తామంటున్నారు. రాత్రి పూట వెలుతురు లేకపోవడంతో అక్కడ ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లుగా డి.ఎస్.పి మహేష్ గౌడ్ తెలిపారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈ సమస్యలను పరిష్కరించే అవకాశాలున్నాయి. దానితో ప్రమాదాలు చాలావరకు తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Mahbubnagar, Road accident, Telangana News

  ఉత్తమ కథలు