• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • ACB OFFICIALS RAID KAMAREDDY DSP RESIDENCE IN HYDERABAD SU

ACB Raids: కామారెడ్డి డీఎస్పీ నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు.. బుల్లెట్లు స్వాధీనం

ACB Raids: కామారెడ్డి డీఎస్పీ నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు.. బుల్లెట్లు స్వాధీనం

ప్రతీకాత్మక చిత్రం

కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు(ACB Raids) నిర్వహించారు

  • Share this:
    కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ నివాసంలో ఏసీబీ అధికారులు(ACB Raids) సోదాలు నిర్వహించారు. శనివారం రోజున హైదరాబాద్ తిరుమలగిరిలోని ఆయన నివాసంలో సోదాలు జరిపిన అధికారులు కొన్ని ఆస్తి పత్రాలతో పాటుగా బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో లక్ష్మీనారాయణకు క్లీన్‌చిట్ వచ్చినప్పటికీ.. అక్రమ ఆస్తుల కోణంలో నిన్న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లక్ష్మీనారాయణ ఇంటితోపాటు.. ఆయనకు సంబంధించిన అన్ని అపార్ట్‌మెంట్లతో పాటు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆదివారం మరోసారి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే ఆయన్ను విచారించే అవకాశం ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

    ఇక, కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐపీఎల్‌ బెట్టింగ్‌ వ్యవహారంలో లక్లల రూపాయలు చేతులు మారగా.. పోలీసులకు పట్టుబడ్డ నిందితుల నుంచి లంచం తీసుకున్న పట్టణ సీఐ జగదీశ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా ఉన్న సుజయ్‌ అనే వ్యక్తిని కూడా ఏసీబీ అరెస్టు చేసింది.సుజయ్‌ వాంగ్మూలం మేరకు కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ, మరో ఇద్దరు ఎస్సైలపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే గత నెలలలో ఏసీబీ అధికారులు కామారెడ్డిలోని లక్ష్మినారాయణ ఇంట్లో కూడా సోదాలు చేపట్టారు.
    Published by:Sumanth Kanukula
    First published: