ACB OFFICERS ONCE AGAIN ENQURIY LAND GRABING ALLEGATIONS OF EETALA RAJENDER VRY HYD
Eetala Rajender : ఈటల భూకబ్జా ఆరోపణలపై మరోసారి విచారణ..
ఈటల రాజేందర్ (ఫైల్)
Eetala Rajender : ఈటల రాజేందర్ భార్యకు చెందిన కంపనీకి చెందిన అసైన్డ్ భూముల ఆక్రమణ విచారణ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. జమున హెచరీస్‌కు చెందిన భూములకు సంబంధించి నేడు మరోసారి మెదక్ జిల్లా మసాయిపేట తహాసీల్దార్ కార్యాలయంలో ఏసిబీ అధికారులు విచారణ జరిపారు.
ఈటల రాజేందర్ భార్యకు చెందిన కంపనీకి చెందిన అసైన్డ్ భూముల ఆక్రమణ విచారణ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. జమున హెచరీస్‌కు చెందిన భూములకు సంబంధించి నేడు మరోసారి మెదక్ జిల్లా మసాయిపేట తహాసీల్దార్ కార్యాలయంలో ఏసిబీ అధికారులు విచారణ జరిపారు. కార్యాలయంలోని పాత రికార్డులను అధికారులు పరీశీలించారు.
అయితే నేడు ఈటల రాజేందర్‌పై భూ ఆక్రమణల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలనే సీఎం కేసిఆర్ ఏకంగా సీఎస్ సోమేష్ కుమార్ తోపాటు నలుగురు ఐఏఎస్ అధికారుల కమిటీ నియమించి త్వరితగతిన విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే..దీంతో అధికారులు ఎలాంటీ నోటిసులు లేకుండా ఈటల రాజేందర్ కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న జమున హెచరీస్ భూముల్లోకి అక్రమంగా వెల్లి విచారణ జరిపారు. రెండు రోజుల పాటు ఉన్నతాధికారులు హంగామా చేశారు.
దీంతో ఈటల రాజేందర్ కుటుంబసభ్యులు అక్రమ చొరబాటుతో పాటు తమకు కనీసం నోటీసులు ఇవ్వకుండా విచారణ జరిపారంటూ కోర్టు వెళ్లడంతో అధికారులకు కోర్టు అంక్షింతలు వేసింది. 15 రోజుల నోటిసులు ఇచ్చి విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. అంతకంటే ముందు విచారణకు స్టే ఇచ్చి నిలిపివేసింది.
దీంతో అధికారులు ఈటల కేసులో నోటిసులు ఇచ్చి నిబంధనల ప్రకారం విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగానే నేడు మాసాయిపేటలో పర్యటించారు. ప్రాధమిక విచారణ చేపట్టారు. ముందుగా గ్రామ పంచాయితీ సెక్రటరీ నుండి నివేదిక తీసుకున్నారు. అయితే ఈ నివేదికలో జమున హెచరీస్ 2018, 2019లో ఎన్ఓసీ తీసుకున్నారని అయితే తీసుకున్న ఎన్‌ఓసికి ఇప్పుడున్న భూములకు మధ్య కొంత తేడా ఉందని అధికారులు మీడియాకు వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.