రూ.కోటి 12 లక్షల లంచం.. తెలంగాణలో మరో అవినీతి తిమింగలం

మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్

నర్సాపూర్ మండలం తిప్పల్‌తుర్తి గ్రామానికి చెందిన 112 ఎకరాలకు ఎన్‌ఓసి కోసం అడిషనల్ కలెక్టర్ నగేష్ రూ. కోటి 40 లక్షలు డిమాండ్ చేశారు.

  • Share this:
    తెలంగాణలో మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఓ భూ వివాదంలో మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ రూ. కోటి 12 లక్షల లంచం తీసుకునేందుకు సిద్ధపడ్డాడు. లంచంలో భాగంగా రూ.72 లక్షల విలువైన భూమి రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు డీల్ కుదుర్చుకున్నాడు. లంచం డబ్బుల కోసం ఒప్పంద పత్రం కూడా రాయించుకున్నాడు. ఐతే తొలి విడతగా రూ.40 లక్షలు లంచం తీసుకుంటుడగా ఏసీబీ అధికారులు బుధవారం రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఆడియో క్లిప్ సహా అడ్డంగా దొరికిపోయారు నగేష్. ఈ క్రమంలో ఉదయం మాచవరంలోని నగేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన నివాసంతో మరో 12 చోట్ల తనిఖీలు చేస్తున్నారు.

    ఏసీబీ డీఎస్పీ సూర్య నారాయణ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఇతర ఆస్తులపై కూడా విచారణ మొదలైంది. ఏసీబీ సోదాల్లో సీఐలు ఫయాజ్, గంగాధర్, ఎస్ఐలు మజీద్ అలీ ఖాన్, నాగేంద్ర బాబు, రామలింగారెడ్డి, శంకర్ రెడ్డి, శ్రీధర్ తదితరులు ఉన్నారు. నర్సాపూర్ మండలం తిప్పల్‌తుర్తి గ్రామానికి చెందిన 112 ఎకరాలకు ఎన్‌ఓసి కోసం అడిషనల్ కలెక్టర్ నగేష్ రూ.కోటి 40 లక్షలు డిమాండ్ చేశారు. ఎకరాకు 10 లక్షల చొప్పున.. మొత్తం కోటి 12 డిమాండ్ చేశారు. ఈ కేసులతో అడిషనల్ కలెక్టర్‌తో పాటు రెవెన్యూ సిబ్బంది పాత్రఫై విచారణ చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే నగేష్ భార్యను విచారణ నిమిత్తం బోయిన్‌పల్లికి తరలించారు.
    Published by:Shiva Kumar Addula
    First published: