హోమ్ /వార్తలు /తెలంగాణ /

అందుబాటులోకి ఆరోగ్యశ్రీ సేవలు...ఆస్పత్రులతో ప్రభుత్వం చర్చలు సఫలం

అందుబాటులోకి ఆరోగ్యశ్రీ సేవలు...ఆస్పత్రులతో ప్రభుత్వం చర్చలు సఫలం

నమూనా చిత్రం

నమూనా చిత్రం

బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని..ఇకపై ప్రతి నెలా ఆరోగ్యశ్రీ సేవల చెల్లింపులను జరుపుతామని తెలంగాణ ఆరోగ్యశాఖమంత్రి ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు.

  తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల ప్రతినిధులు చేసిన డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని..ఇకపై ప్రతి నెలా ఆరోగ్యశ్రీ సేవల చెల్లింపులను జరుపుతామని తెలంగాణ ఆరోగ్యశాఖమంత్రి ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. అంతేకాదు ఆరోగ్యశ్రీ ఎంఓయూకు సవరణకు కమిటీని నియమిస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో సమ్మెను విరమిస్తున్నట్లు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి.

  ప్రైవేట్ ఆస్పత్రులు సమ్మె విరమించడంతో రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు తక్షణమే అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కంటే తెలంగాణలో ఆరోగ్యశ్రీ ఎన్నో రెట్లు గొప్పదని ఈటెల రాజేందర్ అన్నారు. ఆయుష్మాన్ భారత్‌తో 25 లక్షల మందికే వైద్యం అందుతుందని..అదే ఆరోగ్యశ్రీతో 84 లక్షల కుటుంబాలకు వైద్య సేవలు అందుతాయని స్పష్టంచేశారు. కాగా, ప్రైవేట్ ఆస్పత్రుల సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలో ఐదు రోజుల పాటు ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Hyderabad, Telangana

  ఉత్తమ కథలు