హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad Free Water Supply Scheme: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ రెండూ ఉంటేనే ఫ్రీ వాటర్.. ఈ రూల్స్ తప్పక తెలుసుకోండి

Hyderabad Free Water Supply Scheme: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ రెండూ ఉంటేనే ఫ్రీ వాటర్.. ఈ రూల్స్ తప్పక తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం ఈ రోజు ప్రతీ ఇంటికి నెలకు 20 వేల లీటర్ల నీటిని అందించే పథకానికి ఈ రోజు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. అయితే లబ్ధిదారులు ఉచితంగా వాటర్ పొందేందుకు అధికారులు రెండు నిబంధనలు విధించారు.

ఇంకా చదవండి ...

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం ఈ రోజు ప్రతీ ఇంటికి నెలకు 20 వేల లీటర్ల నీటిని అందించే పథకానికి ఈ రోజు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. అయితే ఉచితంగా వాటర్ పొందేందుకు అధికారులు రెండు నిబంధనలు విధించారు. అందులో మొదటిది వాటర్ కనెక్షన్ కు మీటర్ తప్పనిసరిగా ఉండాలి. రెండవది.. మీ CAN నంబరును ఆధార్ తో లింక్ చేసుకోవాలి. ఈ మేరకు వాటర్ బోర్డు స్పష్టం చేసింది. మార్చి 31లోగా ఆధార్ లింకేజీ, మీటర్ లేనివారు అప్లై చేసుకోవాలని తెలిపింది. అలా చేసుకున్న వారికే ఈ స్కీమ్​ వర్తించనుందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆధార్ ​లింకేజ్, మీటర్ ఉన్న వారు డిసెంబర్ నెలకు సంబంధించిన బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని వాటర్ బోర్డు తెలిపింది. ఇప్పటి వరకు ఆధార్ లింక్ చేసుకోని వినియోగదారులు తమ CAN నంబర్ కు లింక్ చేసుకోవ‌‌‌‌డానికి www.hyderabadwater.gov.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. లేక పోతే సమీపంలోని మీ సేవా సెంటర్ లోకి వెళ్లి కూడా లింక్ చేసుకోవచ్చు. వినియోగదారులు ఇంకా ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోవడం కోసం 155313, 040-2343 3933 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఇదిలా ఉంటే.. GHMC, హైదరాబాద్ పరిధిలో ప్రజలు ఇవాల్టి నుంచి నెలకు 20 వేల లీటర్ల దాకా తాగునీటిని ఉచితంగా పొందుతారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఇవాళ మంత్రి కేటీఆర్... ఈ ఉచిత మంచినీటి సరఫరా పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా హైదరాబాదీ ప్రజలు కొన్ని కీలక విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశం రూపంలో ఇచ్చింది. ఈ ఉచిత మంచి నీటి సరఫరా పథకం వ‌ల్ల నగరంలో నివసిస్తున్న సుమారు 97 శాతం పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. వారంతా ఇకపై పరిమితి లోపు నీటిని వాడుకుంటూ... నీటి బిల్లులు చెల్లించే అవసరం లేకుండా చేసుకోవచ్చు.

డిసెంబర్ నుంచే అమలు..

ఉచిత నీటి పథకాన్ని ఇవాళ ప్రారంభిస్తున్నా... డిసెంబ‌ర్ నీటి బిల్లు కూడా ఉచిత పథ‌కం కిందకే వస్తుంది. అందువల్ల డిసెంబ‌ర్ 2020లో 20 వేల లీటర్ల లోపు నీటిని వాడుకున్నవారు ఆ బిల్లులు చెల్లించాల్సిన పనిలేదు. 20 వేల లీట‌ర్ల పైన‌ నీటిని వాడితే.. అదనంగా వాడిన నీటికి బిల్లు చెల్లించాలి. ఈ ఫ్రీ పొందాలంటే... నల్లాలకు నీటి మీట‌ర్లు ఉండాలి. సిటీలో చాలా మందికి అలాంటివి లేవు. ఇప్పుడైనా ఏర్పాటు చేసుకుంటే ఈ బిల్లుల భారం తప్పుతుంది. ఈ స్కీం ఢిల్లీలో అమల్లో ఉంది. ఇప్పుడు తెలంగాణలోని GHMC పరిధిలో అమల్లోకి వస్తోంది.

First published:

Tags: CM KCR, GHMC, Hyderabad - GHMC Elections 2020, Telangana

ఉత్తమ కథలు