Home /News /telangana /

A YOUNGER BROTHER KILLED HIS BROTHER WITH A VEGETABLE KNIFE IN MEDAK MDK PRV

Crime news: కూరగాయలు కోసే కత్తితో అన్నను చంపేసిన తమ్ముడు.. షాక్​లో తల్లిదండ్రులు.. అసలేమైంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అన్నకు తోడుగా ఉండాల్సిన తమ్ముడు క్షణికావేశానికి గురై దారుణానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులను వేధిస్తున్నాడని అన్నని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    (K. Veeranna, News18, Medak) 

    అన్నకు తోడుగా ఉండాల్సిన తమ్ముడు (Younger brother) క్షణికావేశానికి గురై దారుణానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులను వేధిస్తున్నాడని అన్నని అతి కిరాతకంగా హత్య చేశాడు (Murdered). ఈ దారుణ ఘటన మెదక్ (Medak) జిల్లా నర్సాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ పట్టణానికి చెందిన చిత్తారి బుచ్చమ్మ, నర్సింలు దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో పెద్ద కొడుకు లక్ష్మణ్ అలియాస్ ఓంకార్ (38) ఇంటి దగ్గర ఉంటున్నాడు. చిన్న కుమారుడు శేఖర్ పటాన్ చెరులో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజుల కిందట లక్ష్మణ్ అతని భార్యతో గొడవపడ్డాడు. దీంతో భార్య ఆమె పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి లక్ష్మణ్ మనస్తాపంతో మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. మద్యం మత్తులో వారిని కొట్టేవాడు. దీంతో పెద్ద కొడుకు ఇబ్బందులు తాళలేక.. చిన్న కొడుకును తల్లిదండ్రులు ఇంటికి పిలిచి జరిగిన విషయం చెప్పారు.

    ఈ క్రమంలోనే తమ్ముడు శేఖర్ ఎదుటనే అన్న లక్ష్మణ్ మరోసారి తల్లిదండ్రులపై చేయి ఎత్తాడు. అన్నని తమ్ముడు సముదాయించాడు. సోమవారం నాడు అన్నదమ్ములు ఇద్దరు మద్యం సేవించారు. మళ్లీ మాటామాటా పెరగడంతో తీవ్రంగా కోపానికి లోనైన తమ్ముడు శేఖర్.. అన్నని కూరగాయలు కోసే కత్తితో (Vegetable knife) చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    Hyderabad boy Pakistan Girl: ప్రేమెంత పనిచేసే.. లవ్​ కోసం పాకిస్తాన్​ నుంచి అమ్మాయిని దింపిన హైదరాబాద్​ కుర్రాడు.. చివరికి..


    ఏపీలోనూ..

    ఏపీలోనూ గతంలో ఇద్దరు సోదరుల మధ్య గొడవ ఒకరి హత్యకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం శంకరాపురం గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య, నాగార్జున ఇద్దరూ అన్నదమ్ములు. సోదరులంటే ఇలా ఉండాలి అని కలిసిమెలిసి ఉండేవారు. ఇద్దరిలో పెద్దవాడైన వెంకట సుబ్బయ్య అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో గత కొంతకాలంగా చనువుగా ఉంటున్నాడు. ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వస్తున్నాడు. దీంతో వారి గురించి ఊరంతా హేళనగా మాట్లాడేవారు. అన్నతీరుతో కుటుంబం పరువు పోతుందని భావించిన తమ్ముడు నాగార్జున.. అతడ్ని హెచ్చరించారు. చెడు తిరుగుళ్లు తిరగొద్దని భావించారు. అన్నా ఇంటి పరువు తీయొద్దని నచ్చజెప్పాడు.

    Munugodu by Elections: తెలంగాణ రాజకీయం.. మునుగోడులో పోటీకి ఆ జాతీయ పార్టీ భయపడుతోందా? 

    తమ్ముడు ఎంత నచ్చజెప్పినా వెంకట సుబ్బయ్య మాత్రం తీరు మార్చుకోలేదు. నిత్యం సదరు మహిళతో తరిగడం చేశాడు. అన్నతీరు చూసిన నాగార్జున అతడికి ఇంటికెళ్లి గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో వెంకట సుబ్బయ్యను.. నాగార్జున గట్టిగా నెట్టాడు. దీంతో అతడు కింద పడిపోయాడు. తలకు తీవ్రగాయం కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Crime news, Medak

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు