ఖమ్మం (Khamma) జిల్లాలో అధికార పార్టీ నేతల వేధింపులతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన (Man trying to suicide) ఘటనను ప్రజలు మరిచిపోకముందే సరిగ్గా అలాంటి ఘటనే మరొకటి ఆదిలాబాద్ (Adilabad)జిల్లా కేంద్రంలో పునరావృతమైంది. అయితే స్థానికులు అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు సురక్షితంగా ఉన్నాడు. అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నేతల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అధికార పార్టీ శాసనసభ్యుడు జోగు రామన్న క్యాంపు కార్యాలయంలో (Jogu Rammanna camp office) ఆత్మాహత్యా యత్నం చేయడం (Man trying to suicide) స్థానికంగా కలకలం రేపింది. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉన్న కొందరు కౌన్సిలర్లు, టిఆర్ ఎస్ నాయకులు అది గమనించి ఆ యువకుడిని వారించి చేతిలోని పెట్రోల్ బాటిల్ లాక్కున్నారు. అతని ఒంటిపై నీళ్లు చల్లారు. జిల్లా కేంద్రంలో కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
స్థలాన్ని, ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నం?
ఆదిలాబాద్ (Adilabad) పట్టణంలోని రాంనగర్ కు చెందిన ఆవుల సంతోష్ (Avula santhosh) అనే యువకుడు పట్టణంలోని 170 సర్వే నెంబర్ లో ఇల్లు కట్టుకున్నాడు. వికలాంగురాలైన తన తల్లికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్థలాన్ని ఇచ్చింది. డ్రైవర్ గా పనిచేస్తున్న ఆ యువకుడు కొంత డబ్బును పోగుచేసుకొని తన తల్లికి ప్రభుత్వం ఇచ్చిన ఈ స్థలంలో ఇల్లు కట్టుకున్నాడు. అయితే టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఆ స్థలాన్ని , ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారని యువకుడు ఆరోపించాడు. తాజాగా తాను లేని సమయంలో తన భార్య పిల్లలను ఇంటి నుంచి గెంటేశారని పేర్కొన్నాడు. అధికార పార్టీ నేతల వేధింపులు తాళలేక మానసికంగా ఒత్తిడికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి..
టీఆర్ఎస్ పార్టీకి చెందిన దయాకర్, నవీన్, కార్తీ తో పాటు మరికొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సంతోష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు సత్వర న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చానని స్పష్టం చేశాడు. తనకు ఎమ్మెల్యేతో గాని, మున్సిపల్ చైర్మన్ తో గాని ఏ పేచీ లేదని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే అధికార పార్టీ నేతలు జిల్లాలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భూముల లావాదేవీల విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఆ ఆరోపణలకు బలాన్నిచేకూర్చినట్లైంది. ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు అలర్ట్ అయి నిజాయితీగల లీడర్లుగా ఉంటారేమో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Attempt to suicide, Khammam