హోమ్ /వార్తలు /తెలంగాణ /

Siddipeta: పోలీసుల చర్యలతో గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుడి మనస్తాపం.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

Siddipeta: పోలీసుల చర్యలతో గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుడి మనస్తాపం.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

పురుగుల మందు తాగుతున్న బాధితుడు

పురుగుల మందు తాగుతున్న బాధితుడు

సిద్దిపేట జిల్లా గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులపై పోలీసుల దాడి, కేసులు, అరెస్టులతో మనస్తాపం చెందానంటూ బద్దం రాజు (25) అనే యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

(Veeranna, News 18, Medak)

సిద్దిపేట (Siddipeta) జిల్లా గౌరవెల్లి ప్రాజెక్టు (Gauravelli Project )భూ నిర్వాసితులపై పోలీసుల దాడి, కేసులు, అరెస్టులతో మనస్తాపం చెందానంటూ బద్దం రాజు (25) అనే యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం (Attempt to Suicide) చేశాడు. నంగునూరు మండలం సిద్దన్నపేటలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అతడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అక్కన్నపేట మండలం గుడాటిపల్లికి చెందిన బద్దం మల్లారెడ్డి, సరళ దంపతుల కుమారుడు రాజు. వీరి అయిదెకరాల పొలం, ఇల్లు ప్రాజెక్టులో పోగా, ప్రభుత్వం పరిహారం చెల్లించింది. ఆ సమయంలో రాజు మైనర్ కావడంతో అతడికి ప్యాకేజీ రాలేదు. తాజాగా రూపొందించిన మేజర్ల జాబితాలో అతడి పేరుంది. కుటుంబానికి పరిహారంగా వచ్చిన మొత్తంతో సిద్దన్నపేటలో మూడెకరాల భూమి, ఇల్లు కొనుగోలు చేశారు. రాజు, సరళ అక్కడే వ్యవసాయం చేస్తుండగా, తండ్రి గుడాటిపల్లిలో ఉంటున్నారు. తల్లీకొడుకులు ఈ నెల 8న గుడాటిపల్లికి వెళ్లారు.

వాట్సాప్​లో షేర్​..

అయితే 12వ తేదీ అర్ధరాత్రి పోలీసులు బలప్రయోగం చేయడంతో రాజు ఆందోళనకు గురయ్యాడు. తల్లిని తీసుకుని శనివారం ఉదయం సిద్దన్నపేట వచ్చేశాడు. సాయంత్రం తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దృశ్యాన్ని సెల్ఫీ తీసి వాట్సప్​లో (WhatsApp) ఆ దృశ్యాన్ని సెల్ఫీ తీసి స్నేహితులకు పంపించాడు. 'ఎవరూ చేయని త్యాగం చేస్తున్నా.. పోలీసుల దాడితోనే ఆత్మహత్య చేసుకుంటున్నా. చావుతోనైనా నిర్వాసితులకు పరిహారం వస్తుందనుకుంటున్నా** అంటూ ఆడియో సందేశం పంపాడు. వెంటనే కుటుంబసభ్యులు, మిత్రులు వెళ్లి.. రాజును సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి పర్యవేక్షకులు కిశోర్ తెలిపారు.

అసలేమైంది?

సిద్దిపేట జిల్లాలో అక్కన్న పేట మండలం గుడాటిపల్లిలో కొద్దిరోజుల కిందట అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్‌రన్‌ను భూ నిర్వాసితులు అడ్డుకుంటామని ప్రకటించారు. దీంతో పోలీసులు ముందస్తుగా నిర్వాసితులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులకు భూ నిర్వాసితులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌ నిర్వహించారు. పోలీసుల లాఠీచార్జ్‌లో పలువురు గాయపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తంగా మారడంతో వంద మంది భూ నిర్వాసితులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. మీడియాను గ్రామంలోకి అనుమతించలేదు. దీంతో ఈ విషయాన్ని గవర్నర్​ దృష్టికి కూడా బాధితులు తీసుకెళ్లారు.

తుది దశకు ప్రాజెక్టు..

హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టు చివరి దశకు చేరుకుంది. ప్రాజెక్టు సామర్థ్యం 1.43 టీఎంసీల నుంచి 8.23 టీఎంసీలకు ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ద్వారా హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని 1.60 లక్షల ఎకరాలకు నీరు అందించాలని సర్కార్ నిర్ణయించింది. కాగా, దాదాపు 95% వరకు ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే పంప్‌హౌస్‌ పూర్తి కావడంతో అధికారులు ట్రయల్ రన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో భూనిర్వాసితులు ఆందోళనలు చేస్తున్నారు.

First published:

Tags: Attemp to suicide, Medak, Siddipeta

ఉత్తమ కథలు