హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bike Accident: ప్రాణం తీసిన ఇసుక దందా.. వెంబడించిన పోలీసులు.. బైక్ పై అతివేగంగా వెళ్లిన యువకుడు..

Bike Accident: ప్రాణం తీసిన ఇసుక దందా.. వెంబడించిన పోలీసులు.. బైక్ పై అతివేగంగా వెళ్లిన యువకుడు..

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అనిల్

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అనిల్

Bike Accident: అతడు తన ట్రాక్టర్ ద్వారా రహస్యంగా ఇసుకను తరలిస్తున్నాడు. పోలీసుల రాకను చూసిన అతడు తన బైక్ పై వేగంగా వెళ్లాడు. దీంతో అదుపు తప్పి కెనాల్ లో పడి చనిపోయారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

(పి . శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్ 18 తెలుగు)

అక్రమ ఇసుక దందా అతడి ప్రాణం తీసింది. పోలీసుల జాడను కనిపెట్టిన అతడు ఆ విషయాన్ని తన డ్రైవర్ కు చెప్పాలనే తొందరల్లో బైక్ ను వేగంగా నడిపాడు. అది అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలో పడిపోయారు. వెనకాలే వస్తున్న పోలీసులు గమనించి అతడిని నీటి లో నుంచి తీసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన అతడు చికిత్స పొందుతూ చనిపోయాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామశివారులోని యూటీ వరదాకాల్వలో ప్రమాదవ్దశాత్తు పడి యువకుడు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే లింగపూర్ గ్రామానికి చెందిన కొమ్ము అనిల్ యాదవ్ తెల్లవారుజామున అక్రమంగా ఇసుకరవాణా చేస్తున్న ట్రాక్టర్ లను పోలీసుల నుండి కంటపడకుండా దాటించే క్రమంలో ద్విచక్ర వాహనం పై వెళ్తున్నాడు. అనిల్ కు కాకతీయ కేనాల్ పై పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారనే సమాచారం తెలియడంతో తన ట్రాక్టర్ డ్రైవరుకు సమాచారం అందించాలనే ఆతృత తో బైక్ వేగంగా వెళ్లాడు.

దీంతో బైక్ అదుపుతప్పి కాకతీయ పక్కన ఉన్న యూటీ వరదాకాల్వలో బిడ్జ్ పై నుండి పడడంతో తీవ్రగాయాలయ్యాయి. కాగా వెంబడిస్తున్న.. పోలీసులు ప్రమాదాన్ని గమనించి అనిల్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ అనిల్ మృతి చెందాడు. ఇది ఇలా ఉంటే తన కొడుకు మృతి కి పోలీసులే కారణం అని అనిల్ తండ్రి ఆరోపించారు .

పోలీసులు వెంబడించారు కాబ్బటి తన కొడుకు భయపడి, బైక్ అదుపు తప్పి కెనాల్ లో పడి చనిపోయాడని, తన కొడుకు మృతి కి కారణమైన పోలీసులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంది వచ్చిన కొడుకు చనిపోవడం తో తల్లి తండ్రులు కన్నీరు మున్నీరు గా విలపించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసుకున్నట్లు సమాచారం. కాగా ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు సేకరించి బాధ్యులైన పోలీసుపైన చర్యలు తీసుకుంటామని, కరీంనగర్ సీపీ కమాల్హాసన్ రెడ్డి తెలిపారు.

First published:

Tags: Bike accident, Crime, Karimnagar

ఉత్తమ కథలు