హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nalgonda : గల్లి పంచాయితీ...మాటా మాటా పెరిగి...ఒకరిపై ఒకరు దాడి..యువకుడు బలి

Nalgonda : గల్లి పంచాయితీ...మాటా మాటా పెరిగి...ఒకరిపై ఒకరు దాడి..యువకుడు బలి

ప్రతికాత్మక చిత్రం

ప్రతికాత్మక చిత్రం

Telanagana : చిన్న పంచాయితీకే ప్రాణం పోయేలా కోట్టారు..పరుగులు పెడుతున్నా ఆపకుండా తరమడంతో దెబ్బలు వకుడు చివరకు ప్రాణాలు కోల్పోయాడు..


ఆవేశాలకు పోయి ఓ యువకుడు ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు..సర్ధుకుపోయె చిన్న పంచాయితీలో

ఒకరినోకరు ఘర్షణ పడి చివరకు కొట్టుకున్నారు. సర్ధి చెప్పాల్సిన కుటుంభసభ్యులు సైతం దాడిలో

పాలుపంచుకున్నారు.ఇంకేముంది ఒక్కడిపై నలుగురు దాడి చేయడంతో దెబ్బలకు తాళలేక ఉరుకులు

పరుగులు పెట్టిన యువకుడు చివరకు ప్రాణం విడిచాడు..

వివరాళ్లోకి వెళితే.. నల్గోండజిల్లా కొండమల్లేపల్లి మండలంలోని చింతచెట్టుతండాలోఈ రెండు రోజుల క్రితం ఈసంఘటన చేసుకుంది. గ్రామంలోని సోని అనే వృద్దురాలు సాయంత్రం కావడంతో తన ఇంటి ముందు ఉన్నచెత్తను ఊడ్చి కాల్చివేస్తోంది. అయితే అదే సమయంలో అదే గ్రామానికి చెందిన కృష్ణ అనే యువకుడు ట్రాక్టర్నడుపుకుంటూ వచ్చాడు..చిన్న రోడ్డు కావడంతో మంటలను దాటుకుని వెళ్లేందుకు ఇబ్బందిపడ్డాడు. దీంతోట్రాక్టర్‌ను ఏకంగా సోని ఇంటిముందు పెట్టి, వృద్దురాలు అనికూడ చూడకుండా పెద్దగా అరిచాడు.

ఈ నేపథ్యంలోనే సోని చిన్న కుమారుడు జీవన్‌ ట్రాక్టర్‌ ఇంటి ముందు ఎందుకు పెట్టావని అడిగే క్రమంలో మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఊళ్లోనే విషయం తెలుసుకున్న ట్రాక్టర్ డ్రైవర్ కృష్ణ తండ్రి శంకర్‌,పెదనాన్న కుమారులైన యుగేందర్‌, దేవేందర్‌ ఘటనాస్థలానికి వచ్చి సోని కుమారుడు జీవన్‌పైవిచక్షణారహితంగా దాడి చేశారు.


దీంతో నలుగురు కలిసి ఒక్కడిని కొట్టడంతో దెబ్బలకు తాళలేని యువకుడు పరుగులు పెట్టాడు. అనంతరంఎవరికి చెప్పకుండా వెళ్లి తన పోలం వద్దకు వెళ్లి ప్రాణాలు విడిచాడు.దీంతో రాత్రీ వరకు ఇంటికి రాకపోవడంతోజీవన్ తల్లిదండ్రులు వెతుకుంటూ పోలానికి వెళ్లగా జీవన్ శవమై కనిపించాడు. దీంతో దాడిలో తీవ్రంగాగాయపడటం వల్లనే జీవన్‌ మృతి చెందాడంటూ అతని కుటుంబ సభ్యులు దాడికి పాల్పడిన వారి ఇంటి ముందుమృతదేహాన్ని ఉంచి నిరసన వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకోంది.మరోవైపు శవాన్ని పోలీసుస్టేషన్ముందు పెట్టి ధర్నా చేశారు.

First published:

Tags: Crime news, Nalgonda, Telangana

ఉత్తమ కథలు