హోమ్ /వార్తలు /తెలంగాణ /

corona Benfit : మాస్కులతో 25 లక్షల సంపాదన..ఏకంగా మహిళ భవన నిర్మాణం

corona Benfit : మాస్కులతో 25 లక్షల సంపాదన..ఏకంగా మహిళ భవన నిర్మాణం

corona Benfit : కరోనాతో కోట్లాదిమంది ఆర్ధికంగా , సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటే..మరికొంతమందికి మాత్రం కొంత ఉపాధి చూపించి ఆర్థికంగా నిలబెట్టింది..ఈ నేపథ్యంలోనే ఓ మహిళ సంఘం కరోనా కాలంలో 25 లక్షల రూపాయలు సంపాదించి అందరికి ఆదర్శంగా నిలిచారు

ఇంకా చదవండి ...

  అవకాశాలు అందరికీ వస్తాయి వాటిని అందిపుచ్చుకునే వాళ్ళకే మంచి ఫలితాలు దక్కుతాయని మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని నారాయణపేట జిల్లా మహిళ గ్రామైక్య సంఘాలు నిరూపించాయి. సరిగ్గా అందివచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉపాధి పొందడంతోపాటు లాభాలతో ఏకంగా మంచి భవనమే నిర్మించుకుంటాయి..

  కరోనా కారణంగా గతేడాది మార్చ్‌లో లాక్ డౌన్ అమలైన విషయం తెలిసిందే.. ఆ సమయంలో మాస్కు లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించారు నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన ఆమె సూచనలతో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మహిళా సంఘాల ద్వారా మాస్కుల తయారీకి శ్రీకారం చుట్టింది. డిఆర్డిఎకు కేటాయించిన 30 లక్షల నిధుల నుంచి సంఘాలు మాస్కులు తయారీ మొదలు పెట్టాయి మూడు వేల మందికి పైగా మహిళలు ఇంట్లోనే ఉండి మాస్కులు తయారూ చేశారు.

  ఉపాధి కరువైన ఆ సమయంలో మాస్కులు తయారీ తో పుట్ట నింపుకున్నారు ఏడాది కాలంలో ఆరు లక్షలకు పైగా మాస్కులు తయారు చేశారు...స్థానిక ఆయుర్వేద వైద్యులు డాక్టర్ నారాయణ సహకారంతో ఆయుర్వేద మాస్కులు పోచంపల్లి ఇక్కత్ నారాయణపేట పట్టు 100 శాతం నూలు తదితర విభిన్న రకమైన మాస్కు లను ఆకర్షణీయమైన డిజైన్లలో రూపొందించారు.

  సామాజిక మాధ్యమాలలో ఈ మాస్కుల కు విపరీతమైన ప్రాచుర్యం లభించింది ఆర్డర్లు పోటెత్తాయీ. మెట్రో రైల్, ఫిక్కీ,రాంకిలాంటి సంస్థలు, విజయ్ దేవరకొండ టబు ఫరాఖాన్ లాంటి చిత్రసీమ ప్రముఖులు ఆర్డర్లు ఇచ్చారు డిలైట్ అనే సాఫ్ట్ వేర్ సంస్థ ఏకంగా 63 వేల మాస్కులు తయారు చేయాలని కోరింది దీంతో నారాయణపేట మహిళా సంఘాలు తయారు చేస్తున్నా మాస్క్ లకు మంచి గిరాకీ ఏర్పడింది ఇప్పటికీ వచ్చిన ఆర్డర్లపై కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు..

  మహిళా సంఘాల ఉత్పత్తులకు మంచి ప్రాచుర్యం లభించడంతో వాటికో బ్రాండ్ ఉండాలన్న ఉద్దేశంతో ఆరుణ్య బ్రాండ్ అని ఏర్పాటు చేశారు మాస్కులు కాకుండా చేనేత వస్త్రాలు వ్యవసాయ ఉత్పత్తులు వెదురు ఉత్పత్తులు అంజీర ఉత్పత్తులు పచ్చళ్ళు ఇలా అనేక ఉత్పత్తులను ఆరుణ్య పేరిట వాట్సాప్ ఫేస్ బుక్ ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ లాంటి సామాజిక మద్య మాల ద్వారా ప్రచారం కల్పించడంతోపాటు విక్రయాలు జరుపుతున్నారు.

  మాస్కులు సహా ఇతర ఉత్పత్తుల ద్వారా పెట్టుబడి పోను జిల్లా మహిళా సమైక్య 25 లక్షల నుంచి 30 లక్షల వరకు లాభాలు వచ్చాయి. ఈ లాభాలతో నారాయణపేట జిల్లా కేంద్రంలోని జిల్లా నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని నిర్మించుకుంటున్నారు భవన నిర్మాణానికి 45 లక్షల వరకు ఖర్చు వస్తుండగా జిల్లా కలెక్టర్ హరిచందన సొంత నిధుల నుంచి కొంత సహాయం చేస్తున్నారు ఇందులో నైపుణ్య శిక్షణ కోసం పెద్ద హాలు ఆరుణ్య బ్రాండ్ ప్రచారం కోసం స్టూడియో డిఆర్డిఎ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

  First published:

  Tags: Mahabubnagar, Telangana