• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • A WOMAN WHO WENT TO THE FEVER HOSPITAL IN NALLAKUNTA AFTER DROPPING HER BABY IN A GARBAGE CAN BN

నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో దారుణం.. చెత్తకుండీలో పసికందును పడేసిన మహిళ

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ నగరం నడి బొడ్డున నల్లకుంట ఫివర్ ఆస్పత్రి గేటు పక్కనున్న చెత్తకుండీలో.. ఇంకా, రక్తపు మరకలు కూడా ఆరని ఓ పసి కందు (బాలిక) ఆస్పత్రి సిబ్బంది కంట పడింది.

  • Share this:
    హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును ఎవరో గుర్తు తెలియని మహిళ చెత్తకుండీలో పడేసి వెళ్లిపోయింది. అభం, శుభం తెలియని ఆ చిన్నారి దిక్కులేని దుస్థితిలో రెక్కలు తెగిన పక్షిలా కొన ఊపిరితో విలవిలలాడుతోంది. ఏ తల్లి కన్న బిడ్డో.. కానీ, రక్తపు మరకల తడి ఆరక ముందే కన్న తల్లి ఒడి నుంచి చెత్తకుండీ చెంతకు చేరింది. హైదరాబాద్ నగరం నడి బొడ్డున నల్లకుంట ఫివర్ ఆస్పత్రి గేటు పక్కనున్న చెత్తకుండీలో.. ఇంకా, రక్తపు మరకలు కూడా ఆరని ఓ పసి కందు (బాలిక) ఆస్పత్రి సిబ్బంది కంట పడింది. దీంతో ఆస్పత్రి బయటనున్న చెత్తకుండీ నుంచి ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లిన సిబ్బంది.. సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. దీంతో ముందుగా పాపను పరీక్షించి ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడానికి పిల్లల ఆస్పత్రి నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. శనివారం తెల్లవారుజామున 5 నుంచి 6 గంటల మధ్య బుర్ఖా ధరించిన ఓ వ్యక్తి ఆడ శిశువును వదిలేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులకు సమాచారం అందించడంతో నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Narsimha Badhini
    First published: