• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • A WOMAN WHO FOUGHT WITH CORONA LOST HER LIFE SHE IS FORTUNATE TO HAVE SECURED THREE GOVERNMENT JOB VB NZB

Corona Effect: మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి.. కరోనా మహమ్మారి కారణంగా ఆమె చివరకు..

కరోనా బారిన పడి మరణించిన విజయ(ఫైల్)

Corona Effect: కరోనా మహమ్మారి కారణంగా చాలామంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరినీ వెంటాడుతోంది. ఓ మహిళ మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి చివరకు కరోనా మహమ్మారి బారిన పడి తన ప్రాణాలను విడిచింది. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    (పి. మహేందర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు)

    ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే దాని వెనుక కఠోర సాధన ఉండాలి. ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొవాలి. ప్రస్తుతం జరుగుతున్న ప్రతీ విషయాన్ని తెలుసుకుంటూ ఉండాలి. పుస్తకాలతో కుస్తీ పడుతూ.. వీలైతే కోచింగ్ కూడా తీసుకొని చదవాల్సి ఉంటుంది. ఇంత చేసినా చివరకు పరీక్ష రాసిన తర్వాత ఫైనల్ ఫలితాల్లో ఒక్కోసారి మన పేరు ఉంటుందో ఉండదో తెలియదు. ఒక వేళ ఫైనల్ ఫలితాల్లో పేరు లేకపోతే అప్పటి వరకు చేసిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. మళ్లీ మరో నోటిఫికేషన్ కోసం ఎదురు చూడాల్సి ఉంటుది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారి పరిస్థితి ఇలా ఉంటుంది. కానీ ఓ మహిళ ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలను తన సొంతం చేసుకుంది. మొదటి సారి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి పరీక్షలంటే కాస్తంత కంగారుగా ఉంటుంది. చాలామందికి మొదటి సారి రాసిన పోటీ పరీక్షలో ఉద్యోగం రాక మొదటి ప్రయత్నంలోనే నిరాశ చెందుతారు. ఆ తర్వాత రాసిన పరీక్షల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.

    కానీ ఆ మహిళ తాను రాసిన మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా ఉద్యోగం సాధించిన వెంటనే పంచాయతీ సెక్రటరీ ఉద్యోగానికి పరీక్ష రాసింది. ఆ ఫలితాల్లో కూడా తాను విజయం సాధించి ఉద్యోగం సొంతం చేసుకుంది. తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసిన గ్రూప్ 4 ఉద్యోగాల్లో రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించి ప్రస్తుతం తహసీల్దార్ ఆఫీస్ లో పనిచేస్తోంది. అయితే పోటీ ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె కరోనా మహమ్మారిని ఎదిరించలేక పోయింది. చివరికి ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి గ్రామానికి చెందిన విజయ(26).. మొదటి ప్రయత్నంలోనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైయారు.. మల్లుపల్లిలో పంచాయితీ కార్యదర్శిగా పనిచేశారు.

    అయితే గ్రూపు4 రాసి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఎంపికయ్యారు.. ప్రస్తుతం తడ్వాయి తహసీల్ధార్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం ఆమెకు జ్వరం రావడంతో కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు. ఆమె రిపోర్టు పాజిటివ్ గా వచ్చింది. అయితే హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటుండగా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ ఆమె ఇటీవల  మరణించింది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న తోటి ఉద్యోగులు విషాదంలో మునిగిపోయారు.
    Published by:Veera Babu
    First published: