Jagityala : అనారోగ్యానికి గురైన ఓ మహిళ తనకంటూ ఎవరు లేకపోవడంతో దారుణ నిర్ణయం తీసుకుంది. దీంతో తాను పడుకునే మంచాన్నే చితిగా మార్చుకుని నిప్పుపెట్టుకుని సజీవదహనం అయింది.
నా అనే వాళ్లు ఎవరు లేరు.. కట్టుకున్న భర్త, పుట్టిన కొడుకు, మంచి చెడులు చూసుకోవాల్సిన కోడలు సైతం ఆమె ముందే ప్రాణాలు వదిలారు.. చివరకు తన మనవడికి భారమైంది. తాను పెంచాల్సిన మనవడు తన కోసం కష్టపడడంపై ఆందోళణ చెందింది. దీనికి తోడు శరీరం కూడా సహకరించకపోవడంతో ఆమె మంచానికే పరిమితమైంది. ఎన్నో ప్రతికూలతలున్నా ఇన్నాళ్లు మొండిగా మనవడి కోసం జీవించింది. మనవడిని పెద్ద చేసి కూలి పనులకు పంపుతోంది.. ఆ డబ్బుల మీదే జీవితం అతికష్టం మీద వెళ్లదీస్తోంది.. ఇలా ఎక్కువ రోజులు మనవడి కష్టం మీద బతకడం తోపాటు తన ఆనారోగ్యానికయ్యె ఖర్చును భరించలేని స్థాయికి చేరింది. దీంతో ఆమె కఠిన నిర్ణయం తీసుకుంది. చనిపోతే కనీసం దహన సంస్కరాలు ఖర్చు కూడా ఉండకూడదనే బీకర నిర్ణయానికి వచ్చింది.. ఈ క్రమంలోనే తాను పడుకున్న మంచాన్నే చితిగా పేర్చుకుని నిప్పంటించుకుంది.
వివరాల్లోకి వెళితే...జగిత్యాల జిల్లా కేంద్రంలోని బంజరుదొడ్డి ప్రాంతానికి చెందిన బొండ ఈరమ్మ భర్త రత్నం గత ఇరవై సంవత్సరాల క్రితమే అనారోగ్య కారణలతో చనిపోయాడు. అయితే కొద్ది రోజులకే మరో సంఘటన జరిగింది. దీంతో తనకు అండగా ఉండానుకున్న ఒక్కగానోక్క కొడుకుతోపాటు కొడలు సైతం ఎనిమిది సంవత్సరాల క్రితమే చనిపోయారు. అయితే వారికి ఓ కొడుకు ఉన్నాడు. దీంతో ఈరమ్మ తన మనవడు అన్వేష్‌తో కలిసి జీవితం వెళ్లదీస్తోంది. ఎనిమిది సంవత్సరాలుగా వాడికోసమే బతికింది. మనవడు పెద్దయ్యాక కూలి పనులు చేస్తుండడంతో బతుకు వెళ్లదీస్తున్నారు. కాని ఈరమ్మ ఇటివల క్యాన్సర్ సోకడం అందుకు అయ్యె ఖర్చు భరించలేనిదిగా ఉండడంతో ఆమె తట్టుకోలేక పోయింది.
దీంతో జీవితం చాలించాలని తన మనవడికి భారం కాకుదని భావించిన ఆమె మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో తాను పడుకునే మంచానికే నిప్పు అంటించుకుంది. దీంతో ఆ మంటల్లోనే సజీవదహనం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. అయితే ఉన్న నానమ్మ కూడా చనిపోవడంతో అన్వేష్ ఒంటరిగా మిగలడం ఆ ప్రాంతంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.