హోమ్ /వార్తలు /తెలంగాణ /

Siddipet: కేసీఆర్​ నగర్​లో హరీశ్​ రావు సెలూన్​ షాపు.. ఇంతకీ అక్కడ హెయిర్​ కటింగ్​ చేస్తున్నది ఎవరో తెలుసా? ఈ కథ తెలుసుకోవాల్సిందే..

Siddipet: కేసీఆర్​ నగర్​లో హరీశ్​ రావు సెలూన్​ షాపు.. ఇంతకీ అక్కడ హెయిర్​ కటింగ్​ చేస్తున్నది ఎవరో తెలుసా? ఈ కథ తెలుసుకోవాల్సిందే..

హెయిర్​ కటింగ్​ చేస్తున్న లావణ్య

హెయిర్​ కటింగ్​ చేస్తున్న లావణ్య

సిద్ధిపేట జిల్లా. కేసీఆర్​ నగర్​. అక్కడ ఉంది ఓ షాపు. పేరు హరీశ్​ రావు సెలూన్​ . అవును మీరు విన్నది కరెక్టే షాపును స్వయంగా మన మంత్రివర్యులు హరీశ్​ రావే ప్రారంభించారు. అయితే ఆ షాపులో కటింగ్​ చేస్తుంది మాత్రం ఓ మహిళ.

(News 18 ప్రతినిధి, కె.వీరన్న, మెదక్ జిల్లా)

మహిళలంటే (Women) చిన్నచూపు చూస్తున్న ఈ రోజులలో  సిద్దిపేట (Siddipet)కు చెందిన  లావణ్య (Lavanya) అనే వివాహిత తన సత్తా చూపిస్తోంది. భర్త ప్రోత్సాహంతో హెయిర్​ కటింగ్​ చేస్తోంది. హెయిర్ కటింగ్ (Hair cutting) చేయడం చూసి మహిళల పట్ల చిన్న చూపు చూడొద్దని అంటోంది లావణ్య. మనిషి ఎదగాలంటే ఎవరో ఒకరు తోడు ఉండాలి అంటారు. తనకు తన భర్త శ్రీనివాస్​ తోడున్నాడని ఆయన ప్రోత్సాహంతో హెయిర్ కటింగ్ నేర్చుకోని , హెయిర్ కటింగ్ షాప్ (Hair cutting shop) నడుపుతున్నానని పేర్కొంది.  శ్రీనివాస్ (Srinivas) ఏళ్లుగా హెయిర్ కటింగ్ షాప్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. కొన్ని సందర్భాలలో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. కరోనా కష్ట కాలంలో ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి.  ఈ నేపథ్యంలో ఆదాయం పెంచుకునే దిశలో తన భార్యకు కూడా ఈ కులవృత్తిని నేర్పించాలని ఆలోచనతో ఆ భర్త హెయిర్ కటింగ్ నేర్పించాడు. హెయిర్ కటింగ్ (Hair cutting) నేర్పించి ఆమె కాళ్ల మీద  నిలబడే విధంగా చేశాడు .

హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభం..

సిద్దిపేట (Siddipet) జిల్లా సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్​ నగర్ (KCR Nagar) లో గత సంవత్సరం నవంబర్ లో  శ్రీనివాస్​ సెలూన్​ షాపు ప్రస్థానం మొదలైంది. ఈ షాపుకి హరీశ్​ రావు పేరు నామకరణం (Harish Rao saloon) చేశారు శ్రీనివాస్​. అంతేకాకుండా ఈ హెయిర్​ కటింగ్​ షాపును హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు.  శ్రీనివాస్ కు హరీష్ రావు అంటే చాలా అభిమానం.  ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అప్పట్లో 70 వేల మందికి ఉచిత హెయిర్ కటింగ్ చేసిన ఘనత శ్రీనివాస్​ది.

లాక్​డౌన్​ సమయంలో..

శ్రీనివాస్, లావణ్యలకు సొంత ఇల్లు లేకపోవడం తో డబుల్ బెడ్ రూమ్ ఇంటిలో కిరాయి తీసుకొని నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్ న్యూస్ 18 తో మాట్లాడుతూ.. తనకు కుల వృత్తి తో పాటు  సిద్దిపేట జిల్లా అభివృద్ధి దశలో తీసుకెళ్లాలనే కాంక్షతో  70 వేల మందికి ఉచితంగా కటింగ్ చేశానని చెప్పాడు. గత ఏడాదిలో లాక్​డౌన్​ సమయంలో శ్రీనివాస్ భార్యకు  హెయిర్​ కటింగ్ చేయడం నేర్పడం మొదలుపెట్టాడు. తన భార్య ఆ లాక్ డౌన్ సమయంలోనే హెయిర్ కటింగ్ నేర్చుకుందని శ్రీనివాస్ చెప్పారు.


నాయిబ్రాహ్మణుల ఈ కుల వృత్తిని వేరే వారు కూడా చేస్తున్నారని, ఆ నేపథ్యంలోనే తన భార్య లావణ్యకు నేర్పించడం జరిగిందని శ్రీనివాస్ అన్నారు. కులవృత్తులు మర్చిపోతున్న ఈ రోజులలో మా కులవృత్తికి మా కుటుంబం ఒక నిదర్శనం అని తెలిపాడు శ్రీనివాస్. లావణ్యను చూసి మా  నాయి బ్రాహ్మణులు చాలా నేర్చుకోవాలని న్యూస్18 తో చెప్పారు శ్రీనివాస్​. శ్రీనివాస్, ఆయన భార్య లావణ్య ఇద్దరు కలిసి ప్రస్తుతం హెయిర్ కటింగ్ షాప్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నారు.

First published:

Tags: Hair styling, Harish Rao, Kcr, Medak, Siddipet

ఉత్తమ కథలు