Telangana: కరోనా పాజిటివ్ ఉందంటూ ఓ మహిళ వీరంగం.. ఇంటి పత్రాలు ఇవ్వాలంటూ బెదిరింపులు.. చివరకు..

ప్రతీకాత్మక చిత్రం

Telangana: ఇంటికి సంబంధించి పత్రాలు ఇవ్వాలంటూ భార్య తన భర్తపై బెదిరింపులకు దిగింది. తనకు కరోనా పాజిటివ్ ఉంది.. పత్రాలు ఇవ్వడానికి నిరాకరిస్తే కరోనా అంటిస్తా అంటూ బెదిరించడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    దేశంలో కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందడంతో కరోనా కేసులతో పాటు మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో ఎలా బయటపడాలి అని ప్రతీ ఒక్కరూ ఆలోచిస్తుంటే కొంతమంది దీనిని అడ్డం పెట్టుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ లోని జూబ్లి హిల్స్ లో కట్టకున్న భర్తను భార్య బెదిరింపులకు పాల్పడింది. తనకు కరోనా ఉంది.. మర్యాదగా తన పేరు మీద ఉన్న ఇంటికి సంబంధించిన పత్రాలు ఇస్తావా లేదంటే కరోనా అంటించమంటావా అంటూ బెదిరింపులకు దిగింది. దీంతో అతడు భయాందోళనకు గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఆ మహిళను అరెస్టు చేసి అతడిని కాపాడారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం పోలీసులు తెలిపిన
    వివరాలు ప్రకారం ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌ నందగిరిహిల్స్‌కు చెందిన వి.సంజీవరెడ్డి(70) కొన్నేళ్ల క్రితం మొదటి భార్యతో విడిపోయి కోనేరు భారతి(40)ను పెళ్ళి చేసుకున్నాడు. వీరికి 17 ఏళ్ళ కొడుకు ఉన్నాడు. ఆ సమయంలోనే భారతి పేరుమీద ప్రశాసన్‌నగర్‌లో రూ.5 కోట్ల విలువ చేసే ఓ ఇంటిని సంజీవరెడ్డి కొని అక్కడ కాపురం పెట్టారు.

    కొన్ని సంవత్సరాల వరకు బాగానే కాపురం చేశారు. ఆ తర్వాత భారతి కొంతకాలంగా సంజీవరెడ్డిని విడిచి మరో వ్యక్తితో కలసి సహజీవనం చేస్తోంది. దీంతో సంజీవరెడ్డి నందగిరిహిల్స్‌లో ఉన్న మరో ఇంటికి మారే క్రమంలో ఇంటి పత్రాలు కూడా తీసుకెళ్లిపోయాడు. తన పేరు మీద ఉన్న పత్రాలు సంజీవరెడ్డి తీసుకెళ్లడంతో కొద్దికాలంగా సంజీవరెడ్డి, భారతిల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ మధ్య భారతి తనకు సంబంధించిన పత్రాలను ఎలాగైనా తీసుకోవాలనే ఉద్యేశ్యంతో సంజీవరెడ్డి ఇంటికి వెళ్లింది. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, తన పేరుతో ఉన్న ఇంటికి సంబంధించిన పత్రాలు ఇస్తావా లేదంటే కరోనా అంటించ మంటావా అని బెదిరింపులకు దిగింది. దీంతో బయపడిపోయిన సంజీవరెడ్డి వెంటనే ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు.

    బయటకు మాత్రం రాలేదు. మర్యాదగా పత్రాలు ఇస్తే వెళ్లిపోతా లేదంటే నువ్వు వచ్చే దాక ఇక్కడే ఉంటా అంటూ ఆమె బెదిరించింది. అంతే కాకుండా అతడు బయటకు రాకుండా తాళం వేసి నిర్భందించింది. ఇలా మూడు రోజులు ఇంట్లోనే ఒక్కడే ఉన్నాడు. దీంతో అతడికి ఎం చేయాలో అర్థం గాక అతడు ఫోన్‌ ద్వారా జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు సమాచారం ఇవ్వగా.. పోలీసులు వచ్చి సంజీవరెడ్డిని విడిపించారు. నిందితురాలు భారతిపై ఐపీసీ సెక్షన్‌ 446, 341, 506తో పాటు సెక్షన్‌ 3(1)ఆఫ్‌ ఎపిడమిక్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    Published by:Veera Babu
    First published: