Home /News /telangana /

Telangana : గాలిపటాలు ఎగరవేస్తున్నారా.. జర జాగ్రత్త.. బిల్డింగ్ మీద నుంచి పడిపోయిన యువతి

Telangana : గాలిపటాలు ఎగరవేస్తున్నారా.. జర జాగ్రత్త.. బిల్డింగ్ మీద నుంచి పడిపోయిన యువతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana : స‌ంక్రాంతి అంటేనే ప‌తంగుల పండుగ‌. రంగు రంగుల పతంగుల‌ను ఎగ‌రేసేందుకు పిల్ల‌లు, పెద్ద‌లు పోటీ ప‌డుతుంటారు. నా గాలిప‌టం ఆకాశాన్ని తాకాలి అనే ఉద్దేశంతో విశ్ర‌మించ‌కుండా ఎగ‌రేస్తుంటారు. ఈ క్ర‌మంలో చిన్న‌చిన్న పొర‌పాట్లు చేసి ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటారు.

ఇంకా చదవండి ...
    స‌ంక్రాంతి అంటేనే ప‌తంగుల పండుగ‌. రంగు రంగుల గాలిపటాలను ఎగ‌రేసేందుకు పిల్ల‌లు, పెద్ద‌లు పోటీ ప‌డుతుంటారు. నా గాలిప‌టం ఆకాశాన్ని తాకాలి అనే ఉద్దేశంతో విశ్ర‌మించ‌కుండా ఎగ‌రేస్తుంటారు. ఈ క్ర‌మంలో చిన్న‌చిన్న పొర‌పాట్లు చేసి ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటారు. ఇలా గాలిపటం ఎగవేస్తూ ఓ యువతి భవనం మీద నుంచి పడిపోయింది. ఈ ఘటన తెలంగాణలోని జనగామలో జరిగింది. గాలిపటం ఎగరవేస్తూ..ఆ యువతి భవనం అంచుల దగ్గరకి వచ్చింది. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ కాలు జారి కింద పడిపోయింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాలిపటాలను ఎగిరేయడం తప్పుకాదు.. కానీ వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం ఎవరు పాటించరు. ఇలా చేయడం వలన కొంత మంది ప్రాణాలు పోయిన సందర్భాలు కోకొల్లలు. పెద్ద భవనాల పైకి వెళ్ళి గాలిపటాలను ఎగిరేస్తుంటారు. కానీ గాలిపటం ఎత్తుకు ఎగరాలి అనే తొందరభావంతో ఆ భవనంపై ఎక్కడ నిల్చున్నాం అనేది పట్టించుకోరు. అంతేకాకుండా కరెంట్ వైర్లు ఉన్నాయి అనేది చూసుకోకుండా వాటిని ఎగరేయడం చాలా డేంజర్. ఇక కొంత మంది రోడ్డు మీద వాహనాలు, పాదచారులు వస్తున్నా పట్టించుకోకుండా గాలిపటాలను ఎగరేస్తుంటారు. అయితే ఇందులో చేసే పెద్ద పొరపాటు ఎంటంటే.. వాటికి మాములు దారాలు కాకుండా చైనా మంజా దారాలను ఉపయోగించడం వలన అవి అటుగా వెళ్తున్న వారి మెడకు చుట్టుకుంటున్నాయి. వాటితో గొంతు తెగి తీవ్ర రక్తస్రావం జరుగుతంది. గాలిపటాలు ఎగిరేయడానికి ఇప్పటికే అధికారులు ఎన్నో సూచనలు ఇచ్చిన ఎవరు పట్టించుకోవడం లేదు.

    ఇక గాలిపటాలను వాడే దారం, మంజా లాంటివి పక్షులు కాళ్ళకు, రెక్కలకు చిక్కుకొని ఇబ్బందులు పడడం, కొన్ని సందర్భాల్లో వాటి ప్రాణాలు పోవడం జరుగుతుంది. అయితే గాలిపటాలు ఎగిరేసేవారు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా కరెంట్ స్తంభాలు, పెద్ద పెద్ద లైన్ల వద్ద గాలిపటాలు ఎగరేయొద్దు. విశాలమైన ప్రాంతాల్లో, మైదానాల్లో వాటిని ఎగురవేయాలి. అలాగే విద్యుత్ తీగలు, స్తంభాలు, సబ్ స్టేషన్లు మీద పడ్డ గాలి పటాలను తీసుకునేందుకు ప్రయత్నించవద్దు. వీటికోసం కాటన్, నైలాన్, లెనిన్ దారాలను మాత్రమే వాడాలి. మెటాలిక్ దారాలను ఉపయోగించడం వలన.. అవి విద్యుత్ తీగలకు తాకితే పెను ప్రమాదం జరుగుతుంది. పెద్ద భవనాలు, బాల్కనీలు, గోడలపై నిల్చుని గాలిపటాలను ఎగురవేయొద్దు. అంతేకాకుండా చిన్న పిల్లలను గాలి పటాలు ఎగురవేయనికుండా చూసుకోవాలి.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Kites, Pongal, Telangana

    తదుపరి వార్తలు