Home /News /telangana /

A WOMAN CATCH THIEF WITH HER DARE IN KAMAREDDY DISTRICT VRY

Dare Woman : దొంగ, తెచ్చిన కారంపొడి వాడి కళ్లలోనే కొట్టిన ఓ మహిళ... ఆ తర్వాత...ఇలా చేసింది..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Dare Woman : ఓ మహిళ సాహాసం చేసి తోటి మహిళను కాపాడింది.. మెడలో బంగారు గొలుసు ఎత్తుకెళుతున్న దొంగను డేర్ చేసి చాకచక్యంగా పట్టించింది..

    కొన్ని సార్లు ఊహించని సంఘటనలు జరుగుతాయి... కొంతమంది తమ కళ్లముందే..అకస్మాత్తుగా జరిగే సంఘటనలు చూస్తూ నిలబడిపోతారు.. మరికొంతమంది వెంటనే ఆ సంఘటనలపై చాకచక్యంగా వ్వవహరిస్తారు. అది ఎంతటి ప్రమాదమైనా సరే దాన్ని ఎదుర్కొనేందుకు సిద్దమవుతారు. ముఖ్యంగా ప్రమాదాలు జరిగేపప్పుడు గాని, రోడ్డుపైనే హత్యలు, దాడి చేయడం లాంటీ సంఘటనలు జరిగేటప్పుడు తమకేందుకు అంటూ పారిపోతారు..

    కాని కామారెడ్డి జిల్లాలో ఓ మహిళ అలా చేయలేదు... తన కళ్లముందే ఓ మహిళపై కారంపొడితో దాడి జరగడంతో పాటు ఆమె మెడలో బంగారు గొలుసు దొంగ ఎత్తుకెళ్లుతుంటే తీవ్రంగా స్పందించింది. ఆ దొంగ తెచ్చిన కారంపోడితోనే వాడికి చుక్కలు చూపించింది.

    KTR : కేటిఆర్ కొడుకు హిమాన్షుపై తీన్మార్ మల్లన్న ఒపినియన్ పోల్.. తీవ్రంగా స్పందించిన కేటిఆర్


    వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శివాజీ రోడ్డు చౌరస్తాలోని ఓ కాలనీలో ఉదయమే స్థానికంగా ఉండే కృష్ణమూర్తి కిరాణం దుకాణాన్ని ఉదయమే తెరిచేందుకు కిరాణం మహిళా యజమాని చేరుకుంది. షాపు తీస్తుండగానే ఓ గుర్తుతెలియని వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని కిరాణం షాపు వద్దకు వచ్చాడు. తనకు చిప్స్ పాకెట్ కావాలని అడిగాడు.. దీంతో ఆ మహిళ చిప్స్ పాకెట్ తీసి ఇచ్చేలోగా జేబులో డబ్బులు తీస్తున్నట్టు గా నటించి అప్పిటికే తెచ్చుకున్న కారంపోడి పాకెట్ తీశాడు. తనవైపు డబ్బుల కోసం చూస్తున్న ఆ మహిళ కళ్లలో చల్లాడు.. ఆనంతరం ఆ మహిళ మెడలోని బంగారు గొలుసు తెంపుకుని, పారిపోయేందుకు ప్రయత్నించాడు. .దీంతో అప్రమత్తమైన.. ఆ మహిళ కేకలు వేసింది.

    TS IPS transfers : భారీగా ఐపీఎస్‌ల బదిలీ.. హైదరాబాద్ సీపీగా సివీ ఆనంద్


    అయితే సరిగ్గా ఆ సమయంలోనే కిరాణం షాపు వద్దకు స్థానికంగా ఉండే భారతి అనే మహిళ చేరుకుంది. జరుగుతున్న సంఘటనను కళ్లారా చూస్తూ ఊరుకులేదు.. వెంటనే తేరుకుని ఆ దొంగ కింద పడేసిన కారంపొడిని తీసుకుని పారిపోతున్న వాడి కళ్లలో కొట్టింది. అనంతరం దొంగ... దొంగ అంటూ కేకలు వేసింది. దీంతో అలర్ట్ అయిన చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని దొంగను పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అయితే ఆ దొంగతనం చేసిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు అతనికి మతిస్థిమితం సరిగా లేక ఇలా చేశాడని చెబుతుండడం గమనార్హం. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

    crime :ఇలా కూడా ఉంటారా...? కూతురును ఎత్తుకెళ్లాడని.. మర్మాంగాలు కట్..


    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Kamareddy, Theft

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు