A WIFE WHO COULD NOT BEAR THE HARASSMENT OF HER HUSBAND AND STRANGLED HER HUSBAND TO DEATH WITH A CHUNNI IN KAMA REDDY DISTRICT NZB PRV
Wife and husband: భర్త తాగి ఇంట్లో గొడవ చేస్తున్నాడని.. విసిగి వేసారి... కట్టుకున్న భర్తను ఆ భార్య ఏం చేసిందో తెలుసా..
ప్రతీకాత్మకచిత్రం
చిన్నిచిన్న సమస్యలు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. కొందరు భరించలేక మృత్యువును ఆహ్వానించడమో.. ఎదుటివారికి మృత్యువు చూపించడమో చేస్తారు. ఇలాంటి ఘటనే (Incident) ఇటీవల ఒకటి జరిగింది
భార్య భర్తల బంధం (Wife-husband bond) అంటే ఒకరి పై ఒకరికి నమ్మకంతో నిర్మించుకునే జీవితం.. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇద్దరు కలిసి జీవితాన్ని పంచుకునేది. అలాంటి బంధంలో చిన్న మనస్పర్దలు వస్తే జీవితం లో పూడ్చుకోలేని అగాధం ఏర్పడుతుంది. ఇలాంటి చిన్నిచిన్న సమస్యలు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. కొందరు భరించలేక మృత్యువును ఆహ్వానించడమో.. ఎదుటివారికి మృత్యువు చూపించడమో చేస్తారు. ఇలాంటి ఘటనే (Incident) ఇటీవల ఒకటి జరిగింది. భర్త పెట్టే వేధింపులు (Torchers) భరించలేని ఓ భార్య భర్త మెడకు చున్నీతో బిగించి అంతమొందించింది. కానీ తన అక్రమ సంబంధంకు భర్త అడ్డు వస్తున్నాడని భార్యే హత్య చేసిందని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా (Kama reddy) లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
భర్త పెట్టే వేధింపులు భరించలేని ఓ భార్య భర్త మెడకు చున్నీ బిగించిచంపేసింది (Wife murdered Husband). ఈ ఘటన కామారెడ్డి డీఎస్పీ సోమనాథం తెలిపిన ప్రకారం.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అజంపురా కాలనీకి చెందిన ఆఫ్రోజ్ (38) అల్లం వెల్లుల్లి వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఇతని భార్య ఫర్జానా. ఆఫ్రోజ్ రోజు మద్యం సేవించి భార్య ఫర్జానాను మానసికంగా వేధించేవాడు.
ఆ బాధలు భరించలేని ఫర్జానా సోమవారం రాత్రి ఆఫ్రోజ్ నిద్రపోయిన తర్వాత ఆఫ్రోజ్ గొంతుకు చున్నీ బిగించి హత్య (strangled her husband to death) చేసింది. అయితే ఫర్జానాకు ఆఫ్రోజ్ రెండవ భర్త.. మొదటి భర్తతో విడిపోయి ఆఫ్రోజ్ ను పెళ్లి చేసుకుంది. మొదటి భర్తకు సుమారు 15 సంవత్సరాల కుమారుడు ఉండగా అతను ఫర్జానా తోనే ఉంటున్నాడు. రెండవ భర్త అయిన ఆఫ్రోజ్ కు ఇద్దరు కుమారులు కాగా ఒక కుమారుడు చనిపోయాడు.
అయితే ఆఫ్రోజ్ ను ఫర్జానానే హత్య చేసిందా? లేదా ఆమెకు ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆఫ్రోజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కామారెడ్డి డీఎస్పీ సోమనాథం జిల్లా ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. నిందితురాలు ఫర్జానాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా మృతుని బంధువులు మాట్లాడుతూ అఫ్రోజ్ ను భార్య ఫర్జానా కావాలనే హత్య చేసిందని ఆరోపించారు. ఫర్జానా అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని అడ్డు తొలగించుకోవడానికి హత్య చేసిందని పేర్కొన్నారు. అఫ్రోజ్ ను హత్య చేసిన ఫర్జానా ను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.