Home /News /telangana /

A WARD MEMBER TRYED TO COMMIT TO SUICIDE IN FRONT OF DUBBAKA POLICE STATION VRY

Medak : నిమజ్జనంలో ఘర్షణ.. సీఐ తిట్టాడని .. స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం

Medak :  నిమజ్జనంలో ఘర్షణ

Medak : నిమజ్జనంలో ఘర్షణ

Medak: తన భార్యను అవమానించాడని ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళితే స్థానిక సీఐ దుర్భషలాడడంతో ఓ వార్డు మెంబర్ పోలీసు స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు.

    వివరాల్లోకి వెళితే.. మెదక్(medak) జిల్లా దుబ్బాక పోలీసు స్టేషన్‌లో(police station) ఈ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని దుబ్బాక మండలం నర్లెంగడ్డకు చెందిన వార్డు మెంబర్ (ward member)యాదగిరి నిన్న తన భార్య పట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించినందుకు పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు(complaint) చేసేందుకు వెళ్లాడు.

    అయితే ఈ క్రమంలోనే సీఐ హరికృష్ణ (harikrishana)తనను కొట్టి బూతులు తిట్టడడంతో పాటు అవమానానాకి (insult)గురి చేశాడని బాధితుడు ఆందోళనకు గురయ్యాడు. దీంతో తనకు న్యాయం(justies) చేయాలని కోరుతూ తన బంధువులతో కలిసి పోలీసు స్టేషన్ ముందుకు చేరుకుని ఆందోళన నిర్వహించాడు. స్టేషన్ ఎదుటే ఆకస్మాత్తుగా పెట్రోల్(petrol) వంటిపై పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నాలు చేశాడు.

    ఇది చదవండి : కడుపులో బిడ్డకు తండ్రిని నేనంటే నేనంటూ ఇద్దరు ప్రియుల ఘర్షణ.. కత్తులతో దాడులు.. !


    అయితే అక్కడే కానిస్టేబుల్ యాదగిరిని అడ్డుకుని పెట్రోల్ బాటిల్ (petrol bottle)లాక్కున్నాడు.. దీంతో ఒక్కసారిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.దీంతో విషయం కాస్తా ఉన్నతాధికారులకు చేరడంతో స్థానిక ఏసిపీ చల్లా దేవారెడ్డి (ACP Devareddy)స్టేషన్‌కు చేరుకుని బాధితులతో మాట్లాడాడు. వారికి తగిన న్యాయం చేస్తానని హామి ఇచ్చాడు. దీంతో బాధితుడితో పాటు కుంటుంబ సభ్యులు శాంతించారు.

    ఇది చదవండి : బస్సులో వినాయకుడు.. ఊరేగింపుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్..!


    ఇక కేసుకు సంబంధించి శుక్రవారం(Friday) గ్రామంలో వినాయక నిమజ్జన (Ganesh immersion)వేడుకల్లో గ్రామానికి చెందిన వార్డు మెంబర్ ఎమ్మ యాదగిరి , ఎమ్మ లింగం మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే యాదగిరి కుటుంబ సభ్యులపై లింగం వర్గానికి చెందిన వారు దాడి చేయడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని ఏసీపీ వివరించారు. కాగా ఆందోళనతో పాటు సీఐ వ్యవహారం పై పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.

    ఇది చదవండి : నిమజ్జనంలో విషాదం ఏడుగురు బాలికలు మృతి.. !

    Published by:yveerash yveerash
    First published:

    Tags: Dubbaka, Medak

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు