Home /News /telangana /

A VILLAGE WHICH HAS EXTREMISM IS IMMERSED IN SPIRITUAL ACTIVITIES ADB VRY

Adilabad : ఆ గ్రామంలో.. ఒకప్పుడు తుపాకుల మోత.. నేడు వేదమంత్రాల ఘోష.. కారణం ఏమిటి..?

Adilabad

Adilabad

Adilabad : ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ గ్రామాన్ని సందర్శిస్తే.. నేటికి ఆ గ్రామ రూపురేఖలే మారిపోయాయి.. ఆ ఒక్క పర్యటన తుపాకుల మోతలు, నెత్తుటి మరకల నుండి బయటపడి స్వేచ్చగా జీవితం కొనసాగిస్తోంది. దీంతో పాలకులకు చిత్తశుద్ది ఉంటే.. ఏదైనా సాధ్యమేనని నిరూపిస్తోంది.

ఇంకా చదవండి ...
    అది చక్కని చిక్కని అడవులతో నిండి ఉన్న ప్రాంతం అది. దట్టమైన ఆ అడవుల మధ్య బాహ్యా ప్రపంచానికి దూరంగా ఓ గ్రామం. చరిత్రలో నెత్తుటి మరకలు లిఖించిన స్థలం కూడా అది. నాడు జరిగిన ఆ సంఘటనను తలుచుకుంటేనే ఒళ్ళు కంపించిపోతుంది. ఒకప్పుడు ఈ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లి పోయింది. ప్రస్తుతం ఈ ప్రాంతమంతా వేద ఘోషతో మారుమోగుతుంది. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని అభివృద్దివైపు అడుగులు వేస్తూ నాటి నెత్తుటి మరకలను చెరిపేసుకుంటోంది. అందుకు ఆ గ్రామంలో నెలకొల్పిన జీయర్ గురుకులం కూడా ఊతమిస్తోంది.

    అదే నిర్మల్ జిల్లా కడెం మండలంలోని అల్లంపల్లి గ్రామం. అప్పటి వరకు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ అల్లంపల్లి గ్రామం పేరు 1987లో జరిగిన ఎన్ కౌంటర్ ఘటనతో రాష్ట్రవాప్తంగా మారుమోగిపోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆ గ్రామానికి సందర్శనకు రాకతప్పలేదు. అలా వచ్చిన ముఖ్యమంత్రి పర్యటన ఆ గ్రామ రూపురేఖలను మార్చడానికి ఒక కారణమైతే 2004 లో ఆ గ్రామంలో ప్రారంభించిన జీయర్ గురుకులం మార్పుకు మరోకారణమైంది. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుతం నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మారుమూల ప్రాంతం అల్లంపల్లి. 1987లో ఈ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ ఘటన ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసింది.

    Sardar Ravindar sing : మారిన రాజకీయం.. సీఎంతో భేటి అయిన.. సర్ధార్ రవీందర్ సింగ్..


    ఘటన తరాత అసలు ఏమి జరిగిందో తెలుసుకోవడానికి అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. పూరి గుడిసెల్లో నివసించే అల్లంపల్లి వాసులకు పక్కా గృహాలను మంజూరు చేశారు. నాడు జిల్లాలోని నిరుద్యోగులు నక్సలైట్ ఉద్యమం వైపు మరలకుండా సుమారు 1000 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలను కూడా ఇచ్చారు. ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. బస్సు సౌకర్యం లేదు. రాకపోకలకు ప్రైవేటు జీపులు, ఆటోలపై ఆధారపడి గడుపుతున్నారు ఇక్కడి ప్రజలు. నాడు కనీసం పాఠశాల సౌకర్యానికి కూడా నోచుకోని అల్లంపల్లిలో ఎన్ కౌంటర్ ఘటన అనంతరం ఓ ప్రార్థన మందిరానికి చెందిన ఫాదర్ ఇక్కడ పాఠశాలను నెలకొల్పి అక్షరాలు నేర్పించారు. ఆ తర్వాత ఆ పాఠశాల కూడా మూతపడింది.

    మారుతున్న కాలంతోపాటు ఇక్కడి పరిస్థితిల్లోనూ మార్పులు చోటుచేసుకుంటు వస్తున్నాయి. ఈ మార్పుకు చినజీయర్ స్వామి నెలకొల్పిన జీయర్ గురుకులం కూడా ఒక కారణమైందని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. 2001లో ఉట్నూరు మండలంలో బీర్సాయి పేటకు వచ్చిన జీయర్ స్వామి అల్లంపల్లిని సందర్శించారు. వారి విన్నపం మేరకు ఇక్కడ జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురుకులాన్ని నెలకొల్పారు. 2004లో ప్రారంభమైన ఈ జీయర్ గురుకులంలో ఒకటి నుండి 10వ తరగతి వరకు తరగతులను నిర్వహిస్తూ రాష్ట్ర సెలబస్ ప్రకారం విద్యాబోధన కొనసాగిస్తున్నారు. అదనంగా యోగా, శోక్లాలను నేర్పుతూ విద్యార్థులను క్రమశిక్షణకు మారుపేరుగా ఇక్కడి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. 2012 నుండి ఈ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో కూడా విద్యా బోధన సాగుతోంది. నాటి నుండి నేటి వరకు 12 ఎస్.ఎస్.సి బ్యాచ్ లు పూర్తయ్యాయి. వచ్చే సంవత్సరం నుండి పూర్తి స్థాయి ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా మారనుంది.

    Hyderabad : కారులోనే పీకల దాకా తాగాడు... డోరు తీయలేక.. అందులోనే...!


    అల్లంపల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడ విద్యార్హ్తులు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. వారు వెలుగులోకి రావడానికి ఇదొక మంచి విద్యా కేంద్రంగా మారింది. గురుకులంలో చదువుకున్న పలువురు విద్యార్థులు పలువురు ఉద్యోగాలు సాధించి పలు చోట్ల స్థిరపడ్డారు. అల్లంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 12 తండాలు, గూడాలు ఉండగా, 2018 లో ఏర్పాటైన కొత్త గ్రామ పంచాయతీల్లో భాగంగా అల్లంపల్లి పంచాయితీనుండి విడదీసి బాబానాయక్ తాండాను కొత్త గ్రామ పంచాయతీగా మార్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలతో అభివృద్ది వైపుగా అడుగులు వేస్తూ నాటి నెత్తుటి మరకలను చెరిపివేసుకుంటూ ముందుకుసాగుతోంది.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Adilabad, Telangana News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు