ప్రభుత్వ అధికారుల లంచం.. ఓ లారీ డ్రైవర్ ప్రాణాలు తీసింది. అధికారంతో ఓ మాములు డ్రైవర్‌పై తమ ప్రతాపం చూపించారు. అడిగిన డబ్బులు ఇవ్వలేదని అమాయక డ్రైవర్‌పై నీచంగా ప్రవర్తించారు. అడిగినంత లంచం ఇవ్వనందుకు కసిగా కొట్టారు. దీంతో ఆ డ్రైవర్ దెబ్బలకు తాళలేక అక్కడికక్కడే మృత్యువాత పడ్డ సంఘటన నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే... యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి ప్రాంతంలో సేల్ టాక్స్ అధికారులు వాహానాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర,షోలాపూర్‌కు చెందిన బిలాల్ నదాఫ్ అనే ట్రక్ డ్రైవర్ ఏపిలోని గుంటూరు జిల్లా నుండి సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు ట్రక్‌లో ఇనుప సామాగ్రిని తీసుకువస్తున్నాడు. అయితే తుర్కపల్లిలో తనిఖీలలు నిర్వహిస్తున్న కమర్షియల్ టాక్స్ అధికారులు ఈ వాహానాన్ని ఆపారు.
TS first Muslim woman IPS : సలీమా..! కుటుంబమంతా విద్యావంతులే... అందుకే ఆమె ఐపీఎస్.
అనంతరం లోడ్‌ను తనిఖీ చేసి వాహన కాగితాలు పరిశీలించారని, సరుకుకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో, వాహనాన్ని పక్కకు నిలిపి రూ.2 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని క్లీనర్ ఆరోపించారు. ఈ విషయమై డ్రైవర్ ట్రాన్ప్రోర్టు యాజమానులకు ఫోన్ ద్వారా చెప్పి రూ.15 వేలు ఇస్తానని బతిమిలాడినా ఒప్పుకోలేదని, అక్కడే ఉన్న కమర్షియల్ టాక్స్ అధికారి దినేష్ కోపోద్రిక్తుడై నదాఫ్ కాళ్లపై ప్లాస్టిక్ పైప్‌తో కొట్టాడని చెప్పాడు. దీంతో నదాఫ్ ప్యాంట్‌లోనే మూత్ర విసర్జన చేసుకుని అక్కడికక్కడే కుప్పకూలాడని, వెంటనే సేల్‌ట్యాక్స్ అధికారుల కారులోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని, అక్కడి నుంచి భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడని పోలీసులకు తెలిపాడు.
Siricilla : సెల్ఫ్ లాక్డౌన్లోకి ఆ గ్రామాలు.. సిరిసిల్లలో ఒమిక్రాన్ కేసులు
అయితే మృతుడి కొడుకు చేత పోలీసులు ఓ ఫిర్యాదు తీసుకున్నారు. ఆ పిర్యాదు ప్రకారం అధికారులు వాహానాన్ని ఆపిన వెంటనే నదాఫ్ కిందపడిపోయాడని, దీంతో అధికారులు హుటాహుటిన భువనగిరి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్టు ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. దీంతో మొత్తం సంఘటన స్థలంలో లేని మృతుడి కుమారుడితో బలవంతంగా ఫిర్యాదు రాయించుకుంటున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యక్షంగా అక్కడే ఉన్న ట్రక్ క్లీనర్ చెబుతున్న దాన్ని బట్టి అధికారులు దాడులు చేశారనే మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై పోలీసులు విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.