మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుపై బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పోలీసులపై మాకు అనుమానం ఉంది. కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో విచారణ చేయించాలని బీజేపీ నాయకులు హైకోర్టులో పిటీషన్ వేశారు. సిబిఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పిటీషన్ లో పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు (Guvvala balaraju), హర్షవర్ధన్ రెడ్డి (Harshavardhan Reddy), రోహిత్ రెడ్డి (Rohit Reddy), రేగా కాంతారావు (Rega Kantharao)కు పార్టీ మారితే కాంటాక్టులు, డబ్బులు, పదవుల ఆశ చూపి ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. నిన్న రాత్రి మొయినాబాద్ (Moinabadh) తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్ లో పోలీసులు సోదాలు నిర్వహించగా ఈ విషయం బయటకు వచ్చింది. ఈ వ్యవహారంలో రామచంద్రబారతి, సింహయాజి, నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్లో కీలక వివరాలను పొందుపరిచారు పోలీసులు. నిందితుల్లో ఇద్దరు నెల రోజుల క్రితమే పైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohith Reddy)ని కలిసినట్లు వెల్లడించారు. బీజేపీ (BJP)లో చేరితే రూ.100 కోట్లతో పాటు కేంద్ర ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టులను ఇప్పిస్తామని ప్రలోభ పెట్టారని తెలిపారు. బీజేపీలో చేరకుంటే.. ఈడీ, సీబీఐ దాడులతో కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తుందని బెదిరించినట్లు పేర్కొన్నారు.
అయితే ఇదంతా టీఆర్ఎస్ పార్టీ అల్లిన కట్టు కథని బీజేపీ నాయకులూ ఆరోపిస్తున్నారు. మునుగోడులో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ కొత్త డ్రామాలకు తెరతీసిందని బీజేపీ నాయకులు అంటున్నారు. కేసీఆర్ తీసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ (CM KCR)కు తెలంగాణ బీజేపీ (Telangana BJP) అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ఓ సవాల్ విసిరారు. ఫామ్‌హౌస్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని తాను యాదాద్రిలో (Yadadri Temple) ప్రమాణ స్వీకారం చేస్తానని.. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే ఆయన కూడా రావాలని ఛాలెంజ్ విసిరారు.
మొయినాబాద్ (Moinabadh) ఫామ్ హౌజ్ లో జరిగిన భారీ డీల్ కు సంబంధించిన విషయాలను కేసీఆర్ కు నలుగురు ఎమ్మెల్యేలు వివరించారు. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి కేసీఆర్ (Kcr) ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను మరోసారి అడిగి తెలుసుకునే పనిలో పడ్డారు. బీజేపీ నేతలు ఎవరైనా మాట్లాడారా? దానికి సంబంధించి ఆధారాలున్నాయా అనే విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. కాగా దీనిపై సీఎం కేసీఆర్ మరికాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.