హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : మరో బుడతడు పోలీసు స్టేషన్‌కి.. టీచర్ కొడుతున్నాడంటూ ఫిర్యాదు..

Telangana : మరో బుడతడు పోలీసు స్టేషన్‌కి.. టీచర్ కొడుతున్నాడంటూ ఫిర్యాదు..

Telangana : ఇటివల చిన్నపిల్లలు ధైర్యంగా పోలీసు స్టేషన్‌ మెట్లు ఎక్కడం కామన్ మారిపోయింది. తమ ఏ సమస్య వచ్చినా ముఖ్యంగా స్కూళ్లో వచ్చే సమస్యలపై వారు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఓ థర్డ్ క్లాస్ పిల్లాడు టీచర్ తనను కొడుతున్నాడంటూ స్థానిక పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

ఇంకా చదవండి ...

  బయ్యారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు స్కూళ్లో అనిల్ అనే మూడవ తరగతి చదువుతున్న బాలుడు శనివారం తనను టీచర్ కొడుతున్నాడని ఏకంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. వెంకట్ అనే టీచర్ పేరు చెప్పి తనను కొడుతున్నాడని ఆ టీచర్‌పై ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడే ఉన్న మహిళా ఎస్సై రమాదేవి ఆ బుడతడని పలు ప్రశ్నలు వేసింది. ఎవరు కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు. అనే ప్రశ్నలు వేసిన ఆ బుడతడు మాత్రం తడబడ కుండా సమాధానాలు చెప్పాడు.

  దీంతో బాలుడిని వెంటబెట్టుకుని స్కూల్‌కి వెళ్లిన పోలీసులు విచారణ చేపట్టారు. తనను కొట్టిన ఉపాధ్యాయులను అనిల్ పోలీసులకు చూపించాడు. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు విచక్షణ మరిచిపోయి దండించొద్దని పోలీసులు టీచర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోవైపు స్టేషన్‌కు వెళ్లిన సమయంలో అనిల్ మాస్క్ కూడా పెట్టుకుని కరోనా రూల్స్ పాటించడం విశేషం. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీచర్లు కొడితే ఏడుస్తూ ఇంటికెళ్లే పిల్లలనే ఇప్పటివరకూ చూశామని, ఇలా పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ చేయడం విడ్డూరంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

  Adilabad : తెలంగాణలో కోళ్ల పందాలు.. రోజుకో స్థావరంలో అక్రమ దందాలు.

  కాగా ఇటివల కొద్ది రోజుల క్రితం కర్నూలు జిల్లాలో కూడా ఓ బుడతడు తన తోటి విద్యార్థి పెన్సిల్ తీశాడని, వాడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. వాడిపై కేసు పెట్టాలని పోలీసులను సైతం అడిగాడు. అప్పుడు కూడా ఆ సంఘటన వైరల్ గా మారింది. మొత్తం మీద చిన్న పిల్లలు సైతం నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లడంతో పలువురిలో సైతం ధైర్యం నింపుతున్నారు.

  First published:

  Tags: Mahabubabad, Police

  ఉత్తమ కథలు