హోమ్ /వార్తలు /తెలంగాణ /

Adilabad Teacher: స్నేహితులో సరదాగా వెళ్లాడు.. అంతలోనే ఊహించని దారుణం.. పోలీసుల అలెర్ట్​

Adilabad Teacher: స్నేహితులో సరదాగా వెళ్లాడు.. అంతలోనే ఊహించని దారుణం.. పోలీసుల అలెర్ట్​

పెన్​గంగ వద్ద ఉపాధ్యాయుడు

పెన్​గంగ వద్ద ఉపాధ్యాయుడు

అతనో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. స్నేహితులతో కలిసి పక్కరాష్ట్రం వెళ్లాడు. దారిలో వస్తుండగా అందరూ ఒకచోట ఆగారు. అయితే అంతలోనే ఓ షాకింగ్​ ఘటన చోటుచేసుకుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Adilabad, India

  ఆదిలాబాద్ (Adilabad) జిల్లా సరిహద్దులోని జైనథ్ మండలం డొలార వద్ద పెన్ గంగా నదిలో పడి జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు (Teacher) గల్లంతయ్యాడు. ఇంకా ఆచూకి లభించకపోవడంతో గాలింపు ప్రక్రియ కొనసాగుతోంది. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి నదిలో గాలింపు కొనసాగిస్తున్నారు. ఆదిలాబాద్ శాసన సభ్యుడు జోగు రామన్న ఘటనా స్థలన్ని సందర్శించి ప్రమాదం పై ఆరా తీశారు. పెన్ గంగా నదిలో (Penganga River) ఉపాధ్యాయుడు గల్లంతు కావడం జిల్లాలో కలకలం రేపింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నివాసముండే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ధర్మేందర్ సింగ్ (Dharmender Singh) జిల్లాలోని గుడిహత్నూర్ మండలం మన్నూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా విధులను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఎస్.సి.ఇ.ఆర్.టి పాఠ్య పుస్తక రచయితల కమిటిలో కూడా సభ్యుడుగా ఉన్నాడు. పాఠ్యపుస్తకాల కోసం పలు పాఠాలను కూడా రాశారు. అయితే ధర్మేందర్ సింగ్ ఓ పని కోసం తన మిత్రులతో కలిసి మోటర్ సైకిళ్ళపై పొరుగున ఉన్న మహారాష్ట్రలోని బోరికి వెళ్ళారు. తిరిగి ఆదిలాబాద్ కు వస్తుండగా మార్గ మధ్యలో జైనథ్ మండలం డొలార సమీపంలోని పెన్ గంగా నది వద్ద స్నేహితులతో కలిసి కొద్దిసేపు ఆగాడు.


  అదే సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడిపోయాడు. కాపాడమంటూ కేకలు వేయడంతో పక్కనే ఉన్న మరో వ్యక్తి నదిలోకి దూకి రక్షించేందుకు ప్రయత్నించాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కూడా ఘటనా స్థలానికి చేరుకుని చీకటిపడే వరకు గాలింపు చేపట్టారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో వెనుదిరిగారు. తిరిగి గజ ఈతగాళ్ళ సహాయంతో మళ్లీ గాలింపు ప్రక్రియను చేపట్టినప్పటికి గల్లంతైన ఉపాధ్యాయుడి ఆచూకి మాత్రం లభించలేదు. ఆదిలాబాద్ పట్టణంలో గుర్తింపు పొందిన ఉపాధ్యాయుడు కావడంతో పలువురు విచారం వ్యక్తం చేస్తూ ఇదే ఘటన గురించి చర్చించుకుంటున్నారు.  ఇదిలా ఉంటే మరోవైపు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడటం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఆదిలాబాద్ జిల్లా మావల మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తాటి విలాస్ పాఠశాలలో ప్రభుత్వం పంపిణి చేసిన పాఠ్యపుస్తకాలను పుట్టలు వేయని విద్యార్థులను నిలదీయగా, ఆ విద్యార్థులు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. వారు వచ్చి ఉపాధ్యాయుడిని ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పడం వివాదం సద్దుమణిగింది. ఇదే విషయమై ఈ నెల 18వ తేదీన మావల గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి పాఠశాలకు వెళ్ళి ఉపాధ్యాయుడిని నిలదీయడమేకాకుండా అతడిపై దాడి చేశారు.


  Dont come to school: మా ఇంటి దాకా రోడ్డు వేసేదాకా.. స్కూల్‌ నడపొద్దు.. విద్యార్ధులను అడ్డుకున్న గ్రామస్తుడు


  దీంతో అవమానంగా భావించిన సదరు ఉపాధ్యాయుడు తీవ్ర మనస్థాపం చెంది గ్రామంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉపాధ్యాయుడి ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆదిలాబాద్ డి.ఎస్.పి ని కలిసి ఫిర్యాదు చేశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటె ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడితే, మరో ఉపాధ్యాయుడు ప్రమాదవశాత్తు నదిలో పడిగల్లంతు కావడం జిల్లాలో చర్చనీయాంశమవడమేకాకుండా ఈ ఘటనలతో ఇరువురు ఉపాధ్యాయుల కుటుంబాల్లో విషాదం అలుముకుంది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Adilabad, Missing cases, Teacher

  ఉత్తమ కథలు