ఆస్ధుల మధ్య తగదా కొంతమందిని విచక్షణ లేకుండా చేస్తోంది. తమ కన్నవారితో పాటు రక్తం పంచుకుని పుట్టిన వారిని సైతం మరిచి పోయి కక్షలు , కుట్రలతోనే కాలం వెల్లదీస్తారు. ఆధునిక సమాజంలో అందరిని కాదని ఒంటరి జీవితాన్ని అనుభవించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులను సైతం దూరం పెట్టి వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. అయినా కన్నతల్లి దండ్రులు మాత్రం కోడుకులు, కూతుళ్లు చేస్తున్న అవమానాలను మౌనంగా భరిస్తున్నా.. కొన్ని వివాదాలు మాత్రం శృతి మించడంతో పోలీసు స్టేషన్ల వైపు పరుగులు తీస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఓ కొడుకు తన తల్లి మనసు క్షోభ పడేలా వ్వవహరించాడు. ఆస్థి వివాదాల్లో భాగంగా కన్న తల్లి బతికుండగానే చనిపోయి పెద్ద కర్మ నిర్వహిస్తున్నానంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు.వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా కట్టంగూరుకు మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన వారణాశి పోశమ్మకు అనే మహిళకు ఇద్దరు కొడుకులు , నలుగురు కూతుళ్లు, అయితే ఆమె తన జీవనం కోసం ఇతరులపై ఆధారపడకుండా వ్యవసాయ పనులకు వెళుతు జీవనం కొనసాగిస్తోంది. అయితే గత కొద్ది రోజులు ఆమె సంపాదించిన డబ్బుల తోపాటు ఇతర డబ్బులను కూడా కేవలం కూతుళ్లకే ఖర్చు పెడుతుందని, వారికే సంపాదనను పంచుతుందని కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే తనకు తల్లి లేదని, ఇటివలే చనిపోయిందని పెద్ద కర్మ చేస్తున్నానని .. ఏకంగా కార్డు ప్రింట్ చేయించి దాన్ని వాట్సప్‌లో పెట్టాడు.
ఇది చదవండి : చూడ చక్కగా ఉన్నారు.. పెళ్లి చేసుకుని వాళ్ల బతుకేదో వాళ్లు బతుకుతుంటే.
దీంతో ఇది తెలిసిన పోశమ్మ షాక్‌కు గురైంది. బ్రతికి ఉండగానే కొడుకు ఖర్మ చేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకుడని కన్నీరుమున్నీరైంది. ఈ క్రమంలోనే విషయాన్ని పోలీసులకు చెప్పి కొడుకుపై ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై నకిరేకల్ సీఐ నాగరాజు వెంటనే స్పందించి పోశమ్మ పెద్ద కూమారుడు యాదగిరిని పిలిపించారు. పోలీసుల సమక్షంలో యాదగిరి తాను చేసిన తప్పు తెలుసుకుని తల్లికి క్షమాపణ చెప్పాడు. రానున్న ఆదివారం తమ కుటుంబ సభ్యుల మధ్య అన్నీ మాట్లాడుకుంటామని పోలీసులకు చెప్పి తల్లీ, కొడుకులు ఇంటికి వెళ్లిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.