అక్కే అమ్మ.. తమ్ముడి కోసం జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప సోదరి

తాను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోతే తమ్ముడిని ఎవ‌రు చూస్తారాని పెళ్లి చేసుకోకుండా తమ్ముని సేవకు అంకితమైంది. 25 ఏళ్లుగా కంటికి రెప్పలా తమ్మున్ని కాపాడుకుంటుంది.

news18-telugu
Updated: August 13, 2020, 2:49 PM IST
అక్కే అమ్మ.. తమ్ముడి కోసం జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప సోదరి
అక్కే అమ్మ.. తమ్ముడి కోసం జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప సోదరి
  • Share this:
(పి.మ‌హేంద‌ర్, న్యూస్ 18 తెలుగు, నిజామాద్ ప్రతినిధి)
క‌నిపెంచిన త‌ల్లి దండ్రుల‌నే ప‌ట్టించుకోని ఈ రోజుల్లో త‌మ్ముని కోసం ఓ అక్క త‌న జీవితాన్నే త్యాగం చేసింది. మంచానికే పరిమితమైన తమ్ముడి కోసం పెళ్లి కూడా చేసుకోకుండా సేవలు చేస్తోంది. సాధారణంగా తోబుట్టులు ఎవ‌రి జీవితం వారిది అన్న‌ట్లుగా ఉంటారు. ఒక‌రిని ఒక‌రు ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. కానీ 25 యేళ్లుగా మంచానికే ప‌రిమిత‌మైన త‌మ్మున్ని బిడిలు చుట్టి పోషించుకుంటోంది ఓ అక్క‌. త‌న బిడ్డ‌కు సేవా చేసిన‌ట్లుగా సేవాచేస్తుంది. అక్కా-తమ్ముని అనుబంధానికి నిజమైన అర్ధం చెబుతోంది.

నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం అర్గుల్ గ్రామం.. మంచానికే పరిమితమైన ఈ అభాగ్యుని పేరు రమేష్. బీడీలు చుడుతూ ధీనంగా ఉన్న ఈమె పేరు ఇందిర. వీళ్లిద్దరూ రక్తం పంచుకుని పుట్టిన అక్కా-తమ్ముడు. రమేష్ ఇంటర్ వరకు అందరిలా ఉండేవాడు. తండ్రికి స‌హ‌యం చేసేందుకు ఓ రోజు వారి వ్య‌వ‌సాయ క్షేత్రానికి వెళ్లాడు. పొలం వ‌ద్ద విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో క‌రెంట్ పోల్ ఎక్కి విద్యుత్ మ‌ర‌మ‌త్తులు చేస్తుండ‌గా క‌రెంట్ షాక్ త‌గిలి పోల్ పై నుంచి కింద పడిపోయాడు. వెన్నుముఖకు తీవ్రగాయమైంది. కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయాయి. 1996లో ఈ విషాధ ఘటన జరిగింది. ఆ నాటి నుంచి ర‌మేష్ జీవచ్చవంలా మారి మంచానికి పరిమితమయ్యాడు.

ర‌మేష్ వైద్యం కొసం ఉన్నదంతా అమ్మి ఆసుప‌త్రుల చుట్టూ తిరిగారు. అయినా ర‌మేష్ జబ్బు ఏ మాత్రం త‌గ్గ‌లేదు. నడుం కింది భాగం వరకు స్పర్శ లేకుండా పోయింది. జీవితాంతం మంచం పై ఉండాల్సిందేనని వైద్యులు తేల్చి చెప్పారు. అప్పటి నుంచి ఇలా మంచానికి పరిమితమయ్యాడు. కళ్ల ముందే జీవచ్చవంలా మారిన కొడుకుని చూసి మ‌నోవేద‌న‌తో తల్లిదండ్రులు మృతిచెందారు. అప్ప‌టి నుంచి తమ్ముని బాధ్యతను ఇందిర తీసుకుంది. ప‌సిపిల్ల‌ల‌కు సేవ చేసినట్లు తమ్ముడికి సపర్యలు చేస్తుంది. తాను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోతే తమ్ముడిని ఎవ‌రు చూస్తారాని పెళ్లి చేసుకోకుండా తమ్ముని సేవకు అంకితమైంది. 25 ఏళ్లుగా కంటికి రెప్పలా తమ్మున్ని కాపాడుకుంటుంది. బిడీలు చుట్టి కుటుంబాన్ని పోషిస్తుంది. తమ్ముని పరిస్ధితిని చూసి కన్నీటి పర్యంతం అవుతుంది. బిడీలు చుట్టినా కుటుంబం గడవటం కష్టంగా ఉందని తమ్ముని మందుల ఖర్చులకు కూడా స‌రిపోవ‌డం లేద‌ని ఆమె ఆవేద‌న చెందుతోంది. ఎవ‌రైన దాతలు ముందుకొచ్చి త‌మ‌కు ఆర్థిక స‌హ‌యం చేయాని కోరుతుంది ఈ సోదరి.
Published by: Shiva Kumar Addula
First published: August 13, 2020, 2:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading