హోమ్ /వార్తలు /తెలంగాణ /

Fight with Crocodile: నీళ్ల కోసం వచ్చిన గొర్రెను పట్టిన మొసలి.. అది చూసి మొసలిపై దూకిన కాపరి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Fight with Crocodile: నీళ్ల కోసం వచ్చిన గొర్రెను పట్టిన మొసలి.. అది చూసి మొసలిపై దూకిన కాపరి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పెంచుకున్న గొర్రె ప్రాణాలు రక్షించడం కోసం తన ప్రాణాలే ఫణంగా పెట్టి నీటిలోకి దూకిన కాపరి చివరికి ఆ మొసలికి ఆహారంగా మారబోయాడు. ఈ సంఘటన  వనపర్తి జిల్లాలో జరిగింది.

  (Sayyad rafi, News 18, Mahbubnagar)

  పెంచుకున్న గొర్రె (Sheep) ప్రాణాలు రక్షించడం కోసం తన ప్రాణాలే ఫణంగా పెట్టి నీటిలోకి దూకిన కాపరి చివరికి ఆ మొసలికి (Crocodile) ఆహారంగా మారబోయాడు. ఈ సంఘటన  వనపర్తి (Vanaparti) జిల్లాలో జరిగింది. పెబ్బేరు మండల పరిధిలోని  రామాపురం గ్రామానికి చెందిన కోరి రాముడు (Kori ramudu)  రోజు తన గొర్రెలను కాస్తుంటాడు. ఆ రోజుల కూడా గొర్రెలను తీసుకుని బయటకు మేతకు వెళ్లాడు. అయితే సమీపంలో ఉన్న కృష్ణానది (Krishna river)  ప్రాంతంలో  ఎప్పటి లాగానే  గొర్రెలకు నీళ్లు తాపడానికి వెళ్లగా అందులో ఒక  గొర్రెను మొసలి పట్టుకుంది. అది అరుస్తూ ఉండటంతో చూసిన కాపరి (Shepperd)  తన చేతిలో ఉన్న కర్రతో మొసలిని కొట్టాడు.

  రాముడిపై దాడి..

  అయినా మొసలి ఆ గొర్రెను వదలలేదు. చివరికి అతడు చేతిలో కట్టెను వదిలి అతని చేయితో గొర్రెను లాగడానికి ప్రయత్నించాడు.  దీంతో మొసలి రాముడిపై దాడి చేసి, నీటిలోకి అతన్ని లాగింది. ఆ సమయంలో రాముడి ఎడమ చేతితో పాటు కుడి చేతి మణికట్టు దగ్గర  ముసలి కొరికింది. దీంతో అతని చెయ్యి తెగింది. రాముడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయగా  మొసలి నడుం దగ్గర పట్టుకుంది. అనంతరం అతనికి  కడుపుకి రంద్రం పడి తీవ్ర గాయాలయ్యాయి. కొద్దిసేపటి తర్వాత మొసలి రాముడిని వదిలేసింది. దీంతో రాముడిని అక్కడి గ్రామస్థుల సహకారంతో అంబులెన్స్  ద్వారా వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని  ప్రస్తుతం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

  నీటి దగ్గరికి వచ్చిన చిరుతను..

  నీళ్లు తాగడానికి వచ్చని జంతువులపై మొసళ్లు ఎటాక్​ చేయడం కొత్తేమీ కాదు. ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఇటీవలె ఓ మొసలి వీడియో వైరల్​గా మారింది. బాగా దాహంతో ఉన్న ఓ చిరుత తన పిల్లలతో కలిసి చిన్న నీటి గుంత దగ్గరకు వెళ్లడమే అది చేసిన నేరమైంది. పొంచి ఉన్న ప్రమాదాన్ని ఊహించని చిరుత తన పిల్లల్లో ఒకదాన్ని కోల్పోవాల్సి వచ్చింది. చిరుత తన పిల్లలతో కలిసి దాహాన్ని తీర్చుకుంటుండగా నీటి మాటున దాగి ఉన్న మొసలి.. ఓ పిల్లపై దాడి చేసింది. దాడిచేయడమే కాదు ఒక్కసారిగా దాన్ని సరస్సు మధ్యలోకి తీసుకెళ్లి తినేసింది. తన పిల్ల కోసం ఎదురుచూస్తూ ఉండిపోవడం ఆ తల్లి చిరుత వంతయ్యింది. మనిషి ఊహకందని ఇలాంటి ఘటనలు అడవుల్లో చాలా జరుగుతుంటాయి.

  దక్షిణాఫ్రికాలోని ఓ అడవిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దక్షిణాఫ్రికాలోని అడవిలో ఓ చిరుతపులి తన రెండు పిల్లలతో ఒక నీటి గుంత దగ్గరకు వెళ్లింది. అందులో మొసలి ఉండడాన్ని అది గమనించింది. అయితే అప్పటికే బాగా దాహంతో ఉన్న ఆ పులి నీరు తాగడానికి దాని ఒడ్డుకు వెళ్లింది. దానిని అనుసరిస్తూ మొగ చిరుతపిల్ల నీరు తాగుతుండగా, అప్పటికే మాటువేసి ఉన్న మొసలి క్షణాల్లో దాని మెడను పట్టుకుంది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Crocodile, Fighting, Mahbubnagar

  ఉత్తమ కథలు