(Katta Lenin, News 18, Adilabad)
బస్సులు, లారీలు పరిగెత్తాలంటే రోడ్డుండాలి. అదే రైలు (Train) పరుగెత్తాలంటే పట్టాలు ఉండాలి. అంతేకాని పట్టాలపై బస్సులు, లారీలు.. రోడ్డుపై రైలు పరిగెత్తవు (Trains will not run on Roads). కానీ ఆ ఉళ్ళొ మాత్రం రోడ్డుపైనే రైలు బండి దర్జాగా కూతపెడుతూ మరీ పరుగులు (Train running on roads) దీస్తోంది. అసలు పట్టాలపై కూత పెడుతూ, పొగలు కక్కుతూ వయ్యారొలకబోస్తూ వంపులు తిరుగుతూ ఆ రైలు పరుగెడుతుంటే చూసి మురిసిపోని వారెవరు ఉండరు. కాని ఆ ఊళ్ళొ మాత్రం పట్టాలు లేకుండానే రోడ్డు పైన రైలు రయ్ రయ్ మంటు పరుగులు పెడుతొంది. చిన్నారులు కేరింతలు కొడుతూ ఆనందంగా అందులో చక్కర్లు కొడుతుంటే చూసినవారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సుమారు 11 లక్షల రూపాయల ఖర్చు..
ఒకరకంగా రైలును చూడాలన్న ఆ పట్టణవాసుల కల కూడా నేరవేరినట్లవుతోంది. ఇంతకీ పట్టాలు లేకుండా పరుగెడుతున్నఆ రైలును చూడాలని మీకు అనిపిస్తోందా. అలా అయితే ఒకసారి నిర్మల్ (Nirmal) జిల్లా భైంసా పట్టణానికి వెళ్ళిరావాల్సిందే. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి (School director Srinivasa reddy) సుమారు 11 లక్షల రూపాయలను ఖర్చు చేసి ఓ బ్యాటరీ రైలును తయారు చేయించాడు. రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా దీనిని తెప్పించారు. ఒక ఇంజన్ (Engine) దానికి మూడు బోగీలు (Three bogies) ఉన్నాయి. దీన్ని భైంసా (Bhainsa) పట్టణానికి తీసుకువచ్చాడు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను (Students), చిన్న పిల్లలను ఆ రైలు బండిలో కూర్చోబెట్టి పట్టణంలో చక్కర్లు కొట్తిస్తున్నారు. ఆ రైలులో విద్యార్థులకు అవసరమైన వీడియో (Video ), ఆడియో సిస్టమ్‌ను (Audio system) ఏర్పాటు చేయించారు.
పట్టణ వాసుల ఆశ్చర్యం..
ప్రతిరోజు ఉదయం పూట, సాయంత్రం పూట విద్యార్థులను ఎక్కించుకొని పట్టణ రోడ్లపై పరుగులు తీస్తుంటే పట్టణ వాసులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయితే విద్యార్థులకు ఒత్తిడిని దూరం చేసి వారికి మానసికోల్లాసం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టర్ పేర్కొన్నారు.
భైంసా పట్టణ వాసుల కోరిక..
ఇదిలా ఉంటే రైల్వే సౌకర్యం (Rail facility) లేని భైంసా ప్రజల తీరని కోరిక రైలు ప్రయాణం. కనీసం అసలైన రైలు సౌకర్యానికి నోచుకోలేకపోయినప్పటికి కనీసం ఈ బ్యాటరీ రైలుతోనైనా భైంసా పట్టణ వాసుల కోరిక ఒకరకంగా తీరిందని సెటైర్లు వినిపిస్తున్నాయి. చుకు బుకు రైలు వస్తోంది… పక్కకు పక్కకు జరగండి… ఆగినంక ఎక్కండి…. అంటూ పాడుకుంటూ ఆడుకునే చిన్నపిల్లలు ఇలా బ్యాటరీ రైలులో చక్కర్లు కొడుతూ సందడి చేస్తుండటంతో స్థానికులు ముచ్చటపడిపోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.