హోమ్ /వార్తలు /తెలంగాణ /

School Bus in floods: మహబూబ్​నగర్​లో కలకలం.. వరద నీటిలో చిక్కుకున్న స్కూల్​ బస్సు..

School Bus in floods: మహబూబ్​నగర్​లో కలకలం.. వరద నీటిలో చిక్కుకున్న స్కూల్​ బస్సు..

బస్సులో నుంచి విద్యార్థులను రక్షిస్తున్న స్థానికులు

బస్సులో నుంచి విద్యార్థులను రక్షిస్తున్న స్థానికులు

వర్షాల తాకిడికి పలు చెరువులు, కాలువలు నిండిపోయాయి, వరదలు కూడా ఎక్కువైపోయాయి. కాగా, ఉమ్మడి మహబూబ్​నగర్ (Mahabunagar )​లో జిల్లాలో పాఠశాల బస్సు (School Bus) కు తృటిలో ప్రమాదం తప్పింది. వరద నీటిలో (Flood water) బస్సు చిక్కుకుంది.

తెలంగాణలో భారీ వర్షాలు (Heavy rains in Telangana) కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో రాగ‌ల మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్లడించింది. శుక్రవారం జ‌గిత్యాల‌, రాజన్న సిరిసిల్ల, కరీంన‌గ‌ర్‌, పెద్దపల్లి, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, సిద్దిపేట‌, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చరించింది. ఆదిలాబాద్‌, కొమ్రంభీమ్ ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, ములుగు, భ‌ద్రాద్రి కొత్తగూడెం, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండ, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట, జోగులాంబ గ‌ద్వాల జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిస్తాయ‌ని తెలిపింది.

అయితే ఈ వర్షాల తాకిడికి పలు చెరువులు (Ponds), కాలువలు నిండిపోయాయి, వరదలు (Floods) కూడా ఎక్కువైపోయాయి. కాగా, ఉమ్మడి మహబూబ్​నగర్ (Mahbubnagar )​లో జిల్లాలో భాష్యం పాఠశాల బస్సు (School Bus) వరద నీటిలో (Flood water) చిక్కుకోవడంతో కలకలం రేగింది. అయితే స్కూల్ బస్సులో 30మంది విద్యార్ధులు సైతం ఉన్నారు. డ్రైవర్​ వరద నీటి నుంచి బస్సును ముందుకు తీసుకెళుతుండగా నీటి మధ్యలోకి వెళ్లిన తర్వాత నిలిచిపోవడంతో ఘటన తలెత్తింది.

వివరాల్లోకి వెళితే.. కొడూరు మాచిన్​పల్లి (kodurur-Machanapally) వద్ద వరద నీటిలో ఈ స్కూల్ బస్సు చిక్కుకుపోయింది. దీంతో బస్సులో ఉన్న విద్యార్ధులు పెద్ద ఎత్తున కేకలు వేశారు. ఈ కేకలు విన్న స్థానికులు బస్సు వద్దకు చేరుకొని బస్సులోని విద్యార్ధులను బయటకు తీశారు.  రామచంద్రాపురుం (Ramachandrapuram) నుంచి సుగురు (Suguru) వైపు బస్సు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. భారీ వర్షాలతో కోడూరు-మాచినపల్లి వద్ద ఉన్న అండర్ బ్రిడ్జి వద్ద నీరు నిలిచిపోయింది. రైల్వే వంతెన కంది అండర్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జి గుండా వాహనాలు ప్రయాణీస్తాయి. అయితే వర్షం నీరుఅండర్ బ్రిడ్జిలో భారీగా చేరింది.


బస్సు కిటికీ వరకు నీరు..

వరద నీటి నుంచి బస్సు వెళ్తుందని భావించిన డ్రైవర్ బస్సును ముందుకు నడిపించినట్లుగా తెలుస్తోంది. అయితే నీటి మధ్యలోకి వెళ్లిన కొద్దిసేపటికే బస్సు ఇంజన్ ఆగిపోయింది. బస్సు నీళ్లలోనే ఉండటాన్ని గమనించిన విద్యార్థులు భయ భ్రాంతులకు గురయ్యారు. వెంటనే విద్యార్ధులు కేకలు వేశారు. బస్సులో ఎల్ కే జీ నుండి ఐదో తరగతి విద్యార్ధులున్నారు. అయితే స్థానికులు గమనించడంతో పెనుముప్పు తప్పింది. బస్సు కిటీకీ వరకు వరద నీరు చేరడంతో బస్సు వరద నీటిలోనే మునిగిపోయింది. అయితే విద్యార్ధులను తీసుకెళ్లేందుకు వెళ్లే సమయంలో అండర్ బ్రిడ్జి వద్ద వరద నీరు అంతగా లేదని డ్రైవర్ చెబుతున్నాడు. అయితే తిరిగి వచ్చే సమయంలో భారీ ఎత్తున వదర నీరు చేరింది. అయితే వరద నీరు పెద్ద ఎత్తున చేరుకుంది. అయితే ఈ నీటి గుండానే డ్రైవర్ నిర్లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లాడు. దీంతో బస్సు నీటి మధ్యలోనే నిలిచిపోయింది.

First published:

Tags: Buses, Floods, Heavy Rains, Mahbubnagar, School

ఉత్తమ కథలు