Home /News /telangana /

A RTD PROFFESER GIVES HIS PROPERTY TO VILLAGE DEVELOPMENT MDK VRY

Siddipet : శ్రీ మంతుడిగా మారిన రిటైర్డ్ ఫ్రొఫెసర్... వారసులను కాదని..

ఫ్రొఫెసర్ దంపతులకు సన్మానం

ఫ్రొఫెసర్ దంపతులకు సన్మానం

  ( News 18 ప్రతినిధి కె.వీరన్న మెదక్ జిల్లా )

  ఆస్తుల కోసం తహతహలాడేవారు సమాజంలో అనేకం.. తమకు తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్థి ఉన్నా ఇంకా సంపాదించాలనే ధోరణి చాలామంది వ్యక్తుల్లో ఉంటుంది. కాని కొద్ది మంది ఇందుకు భిన్నంగా ఉంటారు.. తనకు సంబంధించిన ఆస్థిని ఇతరులకు లేదా ఆయా గ్రామాల అభివృద్దికి అవలీలగా ఇచ్చేస్తారు. ఇలాంటి సంఘటనలతో సమాజంలో అక్కడడక్కడ కూడా మహాభావులు ఉంటారని నిరూపిస్తారు. ఇలా తాజాగా ఓ రిటైర్డ్ ఫ్రొఫెసర్ మరో శ్రీమంతుడిగా మారాడు.. తనకు గ్రామంలో ఉన్న ఆస్థిని గ్రామానికి అంకితం చేశారు.

  వివరాల్లోకి వెళితే..  సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కాసులాబాద్ గ్రామానికి తరతరాలుగా గోత్రాల నర్సింలు కుటుంబం పౌరోహిత్యం చేసేవారు.  నర్సింలుకు భార్య శైలజ, ఇద్దరు కుమారులున్నారు.  ఆయన ఉన్నత విద్యాభ్యాసం చేసి  విశ్వవిద్యాలయంలో ఫ్రొఫెసర్‌గా విధులు నిర్వహించి 2014 లో పదవీ విరమణ పొందారు.  పదవి విరమణ తర్వా  హైదరాబాద్‌లో తన భార్యతో కలిసి నివసిస్తున్నారు.  ఆయన కుమారులు ఇద్దరు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పని చేస్తూ విదేశాల్లో సెటిల్ అయ్యారు...

  Hyderabad : కోతుల నియంత్రణపై సమీక్ష.. రాష్ట్రంలో ఆరులక్షల కోతులు... వాటిని ఏం చేద్దాం...?

  దీంతో తమ అభివృద్ది కారణమైన కాసులాబాబాద్ మట్టి రుణాన్ని తీర్చుకోవాలని వారి కుటుంబం భావించింది.  దీంతో గ్రామంలో ఉన్న ఇళ్లు, మూడెకరాలు సాగు భూమి గ్రామానికే స్వంతం చేశారు.. ఈ క్రమంలోనే భూమిపై వచ్చిన కౌలుతో గ్రామంలో మౌలిక వసతులు, ఆంజనేయుడు శివుడి ఆలయాల అభివృద్ధి చేయాలనే సంకల్పం చేశారు. రహదారులు, మురుగు కాలువలు, బళ్లలో, మౌలిక వసతులు, ఆలయాల నిర్వహణ, లాంటీ అంశాలను దానిపై వచ్చే ఆదాయాన్ని ఖర్చు పెడుతున్నారు.. దీంతో పాటు గ్రామంలో ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే స్పందించి ఆర్ధిక చేయడంతో పాటు తమకు చేతనైన సహాయం చేస్తుండడంతో ఆ ప్రొఫెసర్ దంపతుల సేవలు గ్రామస్థులు పెద్ద ఎత్తున కొనియాడుతున్నారు..

  లక్షల రూపాయల ఆస్తి కోసమే హత్యలు చేసుకునే ఈ రోజుల్లో కోట్ల రూపాయల ఆస్తిని గ్రామానికి అంకితం చేసి పలువురి ఆదర్శప్రాయంగా నిలబడిన ఆ దంపతులను గ్రామస్థులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Siddipeta, Telangana

  తదుపరి వార్తలు