(K. Lenin, News18, Adilabad)
నవ మాసాలు మోసి కన్న తన బిడ్డ(Baby)ను సంరక్షణ కోసం ఓ ఆర్ఎంపీ వైద్యుడికి (RMP Doctor) అప్పగిస్తే, ఆ తల్లి (Mother)కు తెలియకుండానే అమ్మకానికి (For Sale)పెట్టిన వైనం ఆ కన్న తల్లి పోరాటంతో వెలుగు చూసింది. కొమురంభీం ఆసిఫాబాద్ (Komurambhim Asifabad) జిల్లా రెబ్బెన మండలంలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ కు చెందిన ఆర్.ఎం.పి వైద్యుడు మనోహర్ కు మంచిర్యాలకు (Mancherial) చెందిన మంజులతో పరిచయం ఉంది. అయితే మంజుల గత నెలలో మంచిర్యాల ఆసుపత్రిలో ఓ పాపకు (baby) జన్మనిచ్చింది. ఆమె కు అంతకు ముందు ఓ పాప ఉంది. కాగా, సిజేరియన్ ఆపరేషన్ కావడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో పసికందు ఆలనా పాలన చూసుకోవడం ఇబ్బందిగా మారింది. పైగా ఆమెకు ఎవరి తోడ్పాటు గాని, సహకారం గాని లేదు. ఈ పరిస్థితులతో ఆసుపత్రిలో ఉన్న మంజులను చూసేందుకు ఓ మహిళతో కలిసి ఆస్పత్రికి వచ్చిన మనోహర్ కు తన కూతురును అప్పగించింది మంజుల. తాను ఆసుపత్రి నుంచి వచ్చేదాకా పసికందు బాగోగులు చూసుకునే బాధ్యతకు అతడికి అప్పజెప్పి ఆ పసిబిడ్డను ఇచ్చింది.
ఇదిలా ఉంటే ఆసుపత్రి (Hospital) నుండి డిశ్చార్జ్ అయిన మంజుల తన బిడ్డను తిరిగి తీసుకువెళ్ళడం కోసం సదరు ఆర్.ఎం.పి వైద్యుడి వద్దకు గోలేటి కి పలు మార్లు వచ్చింది. వచ్చిన ప్రతిసారి వైద్యుడు కలవకపోవడంతో వెనుదిరిగింది. అయితే సదరు వైద్యుడు అందుబాటులో లేకపోవడం, ఫోన్ లో కూడా అందుబాటులోకి రాకపోవడం, తర్వాత ఓసారి కలిసినపుడు పసిపాప ఢిల్లీలో ఉందని, అమ్మేశాడని చెప్పినట్లు మంజుల వాపోయింది. తన బిడ్డను తనకు అప్పజెప్పాలని పట్టుబట్టింది.
Peddapalli: అయ్యో.. ఆ వ్యాధితో వర్షంలో తడిచిన బాలుడు.. ఆ తర్వాత రెండు రోజులకే..
ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. తన బిడ్డను తెచ్చి ఇవ్వకపోవడంతో ఆర్.ఎం.పి వైద్యుడి ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టింది. ఈ సమాచారం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టిన మంజులకు నచ్చజెప్పెందుకు ప్రయత్నం చేశారు. అటు ఈ విషయం తెలిసిన పలువురు మహిళా సంఘాల నాయకులు, సర్పంచ్.. మంజులకు మద్దతుగా నిలిచారు. వెంటనే పసిబిడ్డను తల్లికి అప్పగించాలని, తల్లి పొత్తిళ్ళ నుండి బిడ్డను వేరు చేసిన ఆర్.ఎం.పి వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేసే వరకు ఆమెకు అండగా ఉండి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.