కరీంనగర్ జిల్లాలో అరుదైన జాతి క్షీరదము.. ఎగబడి చూస్తున్న జనాలు..

అలుగు లేదా పొలుసుల పిపీలికారి అనే పిలువబడే అరుదైన క్షీరదము కరీంనగర్ జిల్లాలో కనిపించింది.

news18-telugu
Updated: October 11, 2019, 1:13 PM IST
కరీంనగర్ జిల్లాలో అరుదైన జాతి క్షీరదము.. ఎగబడి చూస్తున్న జనాలు..
అడవి అలుగు
  • Share this:
అలుగు లేదా పొలుసుల పిపీలికారి అనే పిలువబడే అరుదైన క్షీరదము కరీంనగర్ జిల్లాలో కనిపించింది. దీంతో ఈ జీవిని చూడాటానికి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఎగబడ్డారు.  దీని శాస్త్రీయనామం పాంగోలిన్. ఈ జీవి ఆపద సమయాల్లో వింతగా ప్రవర్తిస్తుంది. ఎవరైన తనకు హాని కలిగిస్తున్నారని భావిస్తే.. ఈ పాంగోలిన్ వెంటనే గుండ్రంగా వలయాకారంలో ముడుచుకోని పోతుంది. అలా ఈ జీవి ప్రమాదాల నుండి తనను తాను రక్షించుకుంటుంది. సూదుల్లాంటి పొలుసున్న ఈ జీవి.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కరీంనగర్ రోడ్ లోని ఓ ఇంట్లో కనిపించింది. దీంతో సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు పట్టుకొని... ఈ అడవి అలుగును దగ్గరలోని అడవిలోకి సురక్షితంగా విడిచిపెట్టారు. కాగా ఈ జాతి అంతరించిపోతున్న క్షీరదాల జాబితాలో ఒకటని ఈ సందర్బంగా అడవి అధికారులు తెలిపారు.
First published: October 11, 2019, 12:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading