హైదరాబాద్ రంజాన్ పండుగ.. 112 ఏళ్ల క్రితం ఇలాగే..

రంజాన్ పండుగ అంటే.. మన హైదరాబాద్ కొత్త రూపును సంతరించుకుంటుంది. అయితే, ఈ ఏడాది మాత్రం కరోనా దెబ్బకు అంతా బోసిపోతోంది.

news18-telugu
Updated: May 25, 2020, 10:37 AM IST
హైదరాబాద్ రంజాన్ పండుగ.. 112 ఏళ్ల క్రితం ఇలాగే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రంజాన్ పండుగ అంటే.. మన హైదరాబాద్ కొత్త రూపును సంతరించుకుంటుంది. అయితే, ఈ ఏడాది మాత్రం కరోనా దెబ్బకు అంతా బోసిపోతోంది. ముస్లిం సోదరులు మసీదులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈద్ శుభాకాంక్షలు కూడా చెప్పుకోలేని సమస్య వచ్చింది. ఇంట్లోనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాల్సి వస్తోంది. గత వందేళ్లలో ఇలా ఎప్పుడూ జరగలేదు. కాకపోతే 112 ఏళ్ల క్రితం కూడా ఇలాగే ఇళ్లలోనే ఎవరికి వారు ప్రార్థనలు చేసుకున్నారు. అప్పుడు మూసీ వరదలు రావడంతో ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకున్నారు. ఈద్గాలు, మసీదులు తెరుచుకున్నా హంగూ ఆర్భాటం లేకుండా రంజాన్‌ను జరుపుకున్నారు. 1908 సెప్టెంబరులో మూసీ వరదలు వచ్చాయి. దాదాపు 17 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. మూసీ వరద తాకిడికి హైదరాబాద్ నగరంలోని అఫ్జల్‌గంజ్ , ముస్సాలం జంగ్, చాదర్‌ఘాట్‌ వంతెనలు తెగిపోయాయి. దాంతో వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. దాదాపు 15 వేలమంది ప్రాణాలు కోల్పోయారు. 20వేల ఇళ్లు నేల మట్టమయ్యాయి. మూసీ వరద బీభత్సానికి అఫ్జల్‌గంజ్‌ ప్రభుత్వాస్పత్రి పూర్తిగా కొట్టుకుపోయింది. కనీసం ఎనిమిది వేల కుటుంబాలు ఆశ్రయం కోల్పోయాయి.

అప్పుడే రంజాన్‌ మాసం కూడా ప్రారంభమైంది. వరదలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేకపోయారు. రంజాన్ నెల ముగిసే నాటికి కూడా ప్రజలు ఇళ్ల నుంచి జనం బయటకి రాలేదు. దాంతో.. పండుగ సంబురాలను పక్కనబెట్టి ఆ డబ్బును వరద బాధితులకు అందజేశారు. అది జరిగి ఇప్పటికి 112 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు హైదరాబాద్‌లో కరోనా దెబ్బకు భయపడి ప్రజలు 2 నెలలుగా గడప దాటి బయటికి రావట్లేదు. ప్రభుత్వ సూచనల మేరకు ఇప్పుడూ ప్రార్థనలు ఇళ్లకే పరిమితమయ్యాయి.
Published by: Shravan Kumar Bommakanti
First published: May 25, 2020, 10:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading